Mechanic Rocky: మీనాక్షి చౌదరికి ప్రపోజ్ చేసిన మాస్ కా దాస్

ABN , Publish Date - Sep 18 , 2024 | 11:02 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగిల్ ‘ఓ పిల్ల’ను మేకర్స్ విడుదల చేశారు.

Mechanic Rocky Movie Still

టైటిల్ చూసి నిజంగానే ప్రపోజ్ చేశాడేమో అని అనుకుంటున్నారేమో.. జస్ట్ పాటలో మాత్రమే. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ బుధవారం చిత్ర సెకండ్ సింగిల్- ‘ఓ పిల్ల’ అనే సాంగ్‌ని విడుదల చేశారు.

Also Read- Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు.. మ్యాటర్ సీరియస్

‘ఓ పిల్లా’ పాట విషయానికి వస్తే.. పెప్పీ బీట్స్‌తో ఇన్స్టంట్‌గా లవ్‌లో పడే బ్యూటిఫుల్ నంబర్‌గా దీనిని కంపోజ్ చేశారు. ఇటీవల వచ్చిన ‘సరిపోదా శనివారం’ కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ని అందించిన జేక్స్ బెజోయ్.. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’లోని సాంగ్ సిట్యువేషన్‌కి పర్ఫెక్ట్ నెంబర్ అందించారు. ఈ పాట రాకీ, ప్రియగా కనిపించిన లీడ్ యాక్టర్స్ లవ్ స్టోరీని అద్భుతంగా ప్రజెంట్ చేసింది.


Mechanic-Rocky.jpg

బి-టెక్ సమయంలో తన ప్రేమను అమ్మాయికి ప్రపోజ్ చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో.. మళ్లీ ఆమెతో కలిసే అవకాశం రావడంతో ఆనందపడతాడు. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ హీరో లవ్‌పై వున్న ఫీలింగ్స్‌ని ప్రజెంట్స్ చేస్తోంది. నకాష్ అజీజ్ ఈ పాటను అద్భుతంగా పాడారు. ఈ పాటలో విశ్వక్ సేన్, మీనాక్షి బ్యూటీఫుల్‌గా కనిపించారు. విజువల్స్ ప్లజెంట్‌గా వున్నాయి. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్‌గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్రానికి సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమా అక్టోబర్ 31న దీపావళి స్పెషల్‌గా విడుదల కానుంది.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 11:02 PM

Mechanic Rockey: విశ్వ‌క్ సేన్.. ‘మెకానిక్ రాకీ’నుంచి ఓ పిల్లో.. లిరిక‌ల్ సాంగ్‌

Mechanic Rocky: దీపావళికి వ‌స్తోన్న విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'

Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

Mechanic Rocky: ‘మెకానిక్ రాకీ’.. ‘గుల్లెడు గుల్లెడు గులాబీలు’ లిరికల్ సాంగ్‌

Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది