Janaka Aithe Ganaka: సుహాస్‌కు ప్రభాస్ సపోర్ట్..

ABN , Publish Date - Jul 04 , 2024 | 07:18 PM

‘ల‌వ్ మీ’ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత మరో దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ మరో వైవిధ్యభరిత చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమా పేరే ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సందీర్ రెడ్డి బండ్ల దర్శకుడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Prabhas and Janaka Aithe Ganaka Movie Still

సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు బ్యానర్స్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (SVC), దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ (Dil Raju Productions) నుంచి సినిమాలు వస్తున్నాయంటే.. అందులో కొత్త కంటెంట్ ఏదో ఒకటి ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన ‘బ‌లగం’ ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బ్యానర్‌లో రీసెంట్‌గా వచ్చిన ‘ల‌వ్ మీ’ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత మరో వైవిధ్యభరిత చిత్రానికి మేకర్స్ శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పేరే ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka).

Also Read- Manamey OTT Release Date: ఓటిటి లోకి ఇంకో ఫ్లాప్ మూవీ వచ్చేస్తోంది, ఎప్పుడు ఎక్కడ అంటే...

శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ (Suhas) హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సందీర్ రెడ్డి బండ్ల దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ను డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


Suhas-Movie.jpg

టీజర్ విషయానికి వస్తే.. ‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’, ‘నేను ఒక వేళ తండ్రినైతే.. నా పెళ్లాన్ని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌లో చూపించాలి.. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్‌లో చేర్పించాలి.. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి.. బెస్ట్ జీవితాన్ని ఇవ్వాలి.. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు’.. అనే డైలాగ్స్.. హీరో ఫ్రస్ట్రేషన్, మిడిల్ క్లాస్ లైఫ్ కష్టాలను ఇందులో ఎంతో ఫన్నీగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు ఈ సినిమాలో సరైన పాళ్లలో ఉన్నాయనేది ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ, విజ‌య్ బుల్గానిన్ సంగీతం టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంది. త్వ‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుహాస్ సరసన సంకీర్తన హీరోయిన్‌గా నటిస్తోంది. (Janaka Aithe Ganaka Teaser Released)

Read Latest Cinema News

Updated Date - Jul 04 , 2024 | 07:18 PM