Suhas: వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నా..

ABN , Publish Date - May 02 , 2024 | 06:08 PM

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె (Arjun YK) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్లు. మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలను హీరో సుహాస్ మీడియాకు తెలియజేశారు.

Suhas: వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నా..
Hero Suhas

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ (Suhas) హీరోగా నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వైకె (Arjun YK) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టిఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna), రాశి సింగ్ (Rashi Singh) హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. మే 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలను హీరో సుహాస్ (Hero Suhas) మీడియాకు తెలియజేశారు.

‘ప్రసన్నవదనం’.. అసలీ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి?

దర్శకుడు చెప్పిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఆయన అనుకున్న స్క్రీన్‌ప్లే, సర్వైవల్ డ్రామా, క్లైమాక్స్ అదిరిపోయాయి. కథ విన్న వెంటనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను.

ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది?

ఇందులో నేను ఆర్జేగా పని చేస్తాను. మామూలు కుర్రాడి పాత్రే. అయితే తనకున్న పేస్ బ్లైండ్ నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు? ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకుంటాడనేది క్యారెక్టర్.

ఈ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఈ పాత్ర కోసం పది రోజులు వర్క్ షాప్ చేశాం. దర్శకుడితో కూర్చుని పాత్ర ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి? ఆ పాత్ర బౌండరీలు ఏమిటి? ఇవన్నీ వర్క్ షాప్‌లో ప్రిపేరైన తర్వాత షూట్‌కి వెళ్లాం. (Hero Suhas Interview About Prasanna Vadanam)

*Kamakshi Bhaskarla: ‘మా ఊరి పొలిమేర 2’ లక్ష్మీకి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్


Suhas-3.jpg

షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమైనా..?

ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ వున్నాయి. అవి చేయడం కాస్త సవాల్‌గా అనిపించింది. అలాగే నాది ఫేస్ బ్లైండ్ నెస్ వున్న పాత్ర. దానికి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలనేది ఛాలెంజింగా అనిపించింది. అయితే వాటిని అచీవ్ చేశాననే అనుకుంటున్నాను.

కొత్త దర్శకుడు అర్జున్‌ (Arjun YK)తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? తన పనితీరు గురించి..?

అర్జున్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనకి దర్శకుడిగా ఇది తొలి సినిమానే కానీ సుకుమార్‌గారితో ఆయన పెద్ద పెద్ద సినిమాలకి పని చేశారు. తనకి చాలా అనుభవం వుంది. చాలా అనుభవం వున్న దర్శకుడిలానే ఈ సినిమాని అద్భుతంగా చేశారు.

ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం ఎలా అనిపించింది?

ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిదే. మణికంఠ ‘కలర్ ఫోటో’ ఫ్యామిలీ డ్రామాకి సహా నిర్మాతగా చేశారు. అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.

ఇద్దరు హీరోయిన్లతో చేస్తున్నారు.. వారి గురించి?

పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) నాకు జోడీగా కనిపిస్తారు. రాశి సింగ్ (Rashi Singh) మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఇద్దరికీ చాలా ప్రాధాన్యత వుంటుంది. అలాగే నితిన్, నందు, హర్ష పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి.

ఫస్ట్ కాపీ చూసే వుంటారు.. ఎలా అనిపించింది?

ఫస్ట్ కాపీ అన్నపూర్ణలో ఒక్కడినే చూశాను. సినిమా పూర్తయిన తర్వాత చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఆనందంతో దర్శకుడిని హత్తుకున్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Suhas-4.jpg


మీ కథల ఎంపిక చాలా యూనిక్ వుంటుంది. ఒక కథని ఎంచుకున్నపుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?

పర్టిక్యులర్‌గా ఏమీ వుండదండీ. మామూలు ప్రేక్షకుడిలానే బ్లాంక్ మైండ్‌తో కథ వింటాను. విన్నప్పుడు ఎక్సయిటింగ్, క్లాప్స్ కొట్టేలా అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తాను.

ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రల్లో... మీకు ఇష్టమైన మూడు పాత్రలు అంటే ఏం చెప్తారు?

‘కలర్ ఫోటో’లో క్యారెక్టర్ ఇష్టం. అలాగే ‘ఫ్యామిలీ డ్రామా’ కూడా ఇష్టం. అందులో చాలా వేరియేషన్స్ వుంటాయి. అలాగే అంబాజీ పేటలో చేసిన పాత్ర. వీటితో పాటు నేను చేసిన అన్ని పాత్రలు ఇష్టపడే చేశాను.

Suhas-2.jpg

భవిష్యత్‌లో ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు?

పర్టిక్యులర్‌గా ప్లాన్ అంటూ ఏమీ లేదు. వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను.

మీ చేతిలో దాదాపు 8 సినిమాలు వున్నాయట కదా.. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? (Hero Suhas Future Projects)

అవును, ఎనిమిది సినిమాలు వున్నాయి. ఎనిమిది సినిమాలు బ్యాలెన్స్ చేయాలంటే నిజంగానే కష్టం. అయితే మా మ్యానేజర్స్, నేను చర్చించుకొని చాలా సమన్వయంతో చేస్తున్నాం. క్రమశిక్షణ విషయానికి వస్తే షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాను. రాత్రి పదింటికి నిద్రపోతాను. మళ్ళీ ఉదయం ఐదింటికి షూటింగ్‌కి వెళ్ళిపోతాను. గ్యాప్ వచ్చిన రోజు కథలు వింటాను.

మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

దిల్ రాజు (Dil Raju) గారి నిర్మాణంలో జూలైలో ఓ సినిమా విడుదల కానుంది. అది చాలా కొత్త కామెడీ ఎంటర్ టైనర్. ‘కేబుల్ రెడ్డి’ షూట్ జరుగుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేష్‌గారితో చేస్తున్న ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అవ్వాలి. కార్తిక్ సుబ్బరాజ్‌గారితో ఒక సినిమా వుంది. అలాగే ఆనందరావు అడ్వంచర్స్‌తో పాటు పాటు మరికొన్ని కథలు వున్నాయి.

ఫైనల్‌గా ‘ప్రసన్న వదనం’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది? (Prasanna Vadanam Movie)

అందరినీ అలరించే సినిమా ఇది. చాలా మంది నా కథల ఎంపిక బావుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. సీట్ ఎడ్జ్‌లో కూర్చుని చూస్తారు. కొన్ని సీన్స్‌కి షాక్ అవుతారు. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా మంచి ఎక్స్‌పీరియన్స్‌తో వెళ్తారు.

Updated Date - May 02 , 2024 | 06:08 PM