Janaka Aithe Ganaka: సుహాస్ కొత్త చిత్ర వివరాలివే..

ABN , Publish Date - Jul 02 , 2024 | 10:36 PM

దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌ నుంచి వ‌స్తోన్న మరో చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Janaka Aithe Ganaka Movie Poster

అతి తక్కువ సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్న సంస్థ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన ‘బ‌లగం’ సినిమా ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇటీవల ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘ల‌వ్ మీ’ కూడా డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ‌గా ప్రేక్షకులని అలరించింది. ఇప్పుడీ బ్యాన‌ర్‌ నుంచి వ‌స్తోన్న మరో చిత్ర అప్‌డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమాకు ‘జనక అయితే గనక’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


Janaka-ayite-ganaka.jpg

ఈ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. సినిమా టైటిల్ ఉన్న ప‌ల‌క‌ను ప‌ట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓర‌గా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్ట‌ర్‌లో న్యాయ‌దేవత బొమ్మ‌, చిన్న‌పిల్ల‌ల‌కు సంబంధించిన స్కూల్ బ్యాగ్‌, స్కూల్ బ‌స్‌, టెడ్డీ బేర్ బొమ్మ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న సుహాస్ మ‌రోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నట్లుగా ఈ పోస్టర్‌తో తెలుస్తోంది. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా నటించనుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే మేక‌ర్స్ తెలియ‌జేయనున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 12:05 AM