Swag: శ్రీ విష్ణు ‘శ్వాగ్’ విడుదల ఎప్పుడంటే..

ABN, Publish Date - Sep 03 , 2024 | 06:54 PM

కింగ్ ఆఫ్ కంటెంట్‌గా పేరున్న శ్రీవిష్ణు మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు.. సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత మరోసారి డైరెక్టర్ హసిత్ గోలీతో చేస్తున్న ‘శ్వాగ్’ మూవీ రిలీజ్ డేట్‌ని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందంటే..

Sree Vishnu in Swag Movie

కింగ్ ఆఫ్ కంటెంట్‌గా పేరున్న శ్రీవిష్ణు మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు (Sree Vishnu).. సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత మరోసారి డైరెక్టర్ హసిత్ గోలీతో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ‘శ్వాగ్’ (Swag). ఈ ఫిల్మ్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Balakrishna: తెలుగు రాష్ట్రాలకు బాలయ్య బాబు భారీ విరాళం

ఈ రిలీజ్ డేట్ అప్‌డేట్‌‌తో ప్రస్తుతం శ్వాగ్ ట్రెండ్ అవుతోంది. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న ‘శ్వాగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్‌గా ఉంటాయని భావిస్తున్నామని.. సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది కాబట్టి రెగ్యులర్ అప్‌డేట్స్‌తో రావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. (Swag Release Date)


ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ సాంగ్, రేజర్ వీడియో, టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై పాజిటివ్ బజ్‌ని ఏర్పడేలా చేశాయి. ఇందులో ఉన్న యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది. శ్రీవిష్ణు సరసన రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Sep 03 , 2024 | 06:54 PM