Swag: ‘శ్వాగ్’ నుంచి ‘రేజర్’.. వేరే లెవల్ అంతే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 09:55 AM

శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హసిత్ గోలీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’లో హిలేరియస్ రోల్‌లో శ్రీవిష్ణు కనిపించనున్నారు. శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి వస్తోన్న మరొక యూనిక్ అటెంప్ట్ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా రేజర్ అంటూ మేకర్స్ ఓ టీజర్‌ని రిలీజ్ చేశారు

Swag: ‘శ్వాగ్’ నుంచి ‘రేజర్’.. వేరే లెవల్ అంతే..
Sree Vishnu in Swag

వైవిధ్యభరితమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయనపై అందరూ కింగ్ ఆఫ్ కంటెంట్ అని ప్రశంసలు కురిపిస్తుంటారు. ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేలా చూసుకుంటూ డిఫరెంట్ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్న శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. హసిత్ గోలీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’ (Swag)లో హిలేరియస్ రోల్‌లో శ్రీవిష్ణు కనిపించనున్నారు. శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి వస్తోన్న మరొక యూనిక్ అటెంప్ట్ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (Sree Vishnu Movie Swag)

Also Read- Pawan Kalyan: పవన్‌కు డిప్యూటీ సీఎం‌తో పాటు కీలక శాఖలు

ఇప్పటికే సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన టీమ్.. తాజాగా రేజర్ (Swag Razor) అంటూ టీజర్‌ని రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు మగవారి గురించి స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వీడియో ప్రారంభమైంది. శ్రీవిష్ణు భవభూతి అనే మగ చావినిస్ట్ క్యారెక్టర్ పోషించారు. అతని లుక్స్, టెర్రిఫిక్ మేకోవర్ ఆడియన్స్‌ని సర్ ప్రైజ్ చేస్తోంది. శ్రీవిష్ణు కనిపించిన తీరు, పలికిన డైలాగ్స్.. ఈ సినిమా మరో లెవల్ అన్నట్లుగా ఉన్నాయి. అతన్ని ప్రేమించినా, ద్వేషించినా, మీరు భవభూతిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు.. అలాంటి కంటెంట్ ఇందులో ఉంది. టీజర్ హైలీ ఎంటర్టైనింగ్‌గా ఉంది. హసిత్ గోలీ మరో యూనిక్ కాన్సెప్ట్‌ని సిద్ధం చేసినట్లుగా అయితే తెలుస్తోంది. (Swag Razor Talk)


Sree-Vishnu.jpg

వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ (Ritu Varma) నటిస్తోంది. ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు, విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్. నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండగా.. దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 15 , 2024 | 10:01 AM