Kannappa: ‘కన్నప్ప’లో నాథనాధుడి ఉగ్రరూపం.. పిక్ వైరల్
ABN, Publish Date - Jul 14 , 2024 | 06:47 PM
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు చెబుతున్న విషయాలు.. సినిమాపై ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి శరత్ కుమార్ లుక్‌ని మేకర్స్ వదిలారు.
హీరో విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మంచు విష్ణు చెబుతున్న విషయాలు.. సినిమాపై ఇంట్రస్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్గా ‘కన్నప్ప’ వాడిన విల్లు విశేషాలను మంచు విష్ణు షేర్ చేయగా.. అవి కాస్తా నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి.
Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?
తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ (Sarath Kumar) పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా (Sarathkumar Birthday Special) ఆదివారం ఆయన పాత్ర వివరాలతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఆయన నాథనాధుడి (Nathanadhudu)గా కనిపించబోతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆయన ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు. ఓ యోధుడిలా శరత్ కుమార్ ఇందులో కనిపిస్తున్నారు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడమే కాకుండా.. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో ‘కన్నప్ప’ చిత్రం రెడీ అవుతోంది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Kannappa Latest Update)
Read Latest Cinema News