Sanjay Dutt: ‘డబుల్ ఇస్మార్ట్’.. సంజయ్ దత్ పాత్ర పూర్తయింది

ABN, Publish Date - Jul 24 , 2024 | 09:48 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‌’. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. తాజాగా తన పాత్రకు సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ తెలిపారు.

Sanjay Dutt in Double Ismart

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ (Puri Jagannadh) బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart). ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. దీంతో బ్యాలెన్స్ వర్క్‌ని పూర్తి చేసేందుకు మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. ఆయన ఈ సినిమాకు సంబంధించి తన పాత్రను పూర్తి చేసినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు.

Also Read- Anasuya: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంతో డ్యాన్స్ నెంబర్ చేశా..

సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి చేసి.. ఈ సినిమాకు తన పాత్రను పూర్తి చేశారు. ఇక ప్రమోషన్స్‌కు ఆయన వస్తారా? రారా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ భాయ్ తన వాయిస్‌ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. (Sanjay Dutt Completes Dubbing For Double Ismart Film)


టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్ డోస్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా నటించింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.

Read Latest Cinema News

Updated Date - Jul 24 , 2024 | 09:48 PM