Double Ismart Lyrical Song: ఈ పాటలో కెసిఆర్ వాయిస్ విన్నారా!

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:04 PM

దర్శకుడు పూరి జగన్నాథ్ ఇంతకు ముందు విజయం సాధించిన 'ఇస్మార్ట్ శంకర్' కి సీక్వల్ గా 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ తో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఛార్మి కౌర్ ఈ సినిమాకి నిర్మాత. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈరోజు ఈ సినిమా నుండి 'మార్ ముంత, చోడ్ చింత..' అనే పాట లిరిక్స్ ని విడుదల చేశారు చిత్ర నిర్వాహకులు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ పాడారు. ఈ పాటలో ఇంకో విశేషం ఏంటంటే ఇందులో ప్రేక్షకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (కెసిఆర్) గొంతును కూడా వినవచ్చు.

Updated at - Jul 16 , 2024 | 05:04 PM