మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Preminchoddu: ‘ప్రేమించొద్దు’ సెన్సార్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే?

ABN, Publish Date - May 09 , 2024 | 03:00 PM

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

Preminchoddu Movie Still

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’ (Preminchoddu). శిరిన్ శ్రీరామ్ (Sirin SriRam) దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో తెరకెక్కిన ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Preminchoddu Movie Censor Completed)

*Elections 2024: టాలీవుడ్‌లో ముఖ్యమంత్రులుగా చేసిన నటులు వీరే..


ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ (Sirin SriRam) మాట్లాడుతూ.. యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణంలో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షికతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగులో విడుదల చేసిన తర్వాత త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఇందులో ఉంటుందని అన్నారు. (Preminchoddu Movie)

Read Latest Cinema News

Updated Date - May 09 , 2024 | 08:27 PM