Nani: కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే సినిమా.. సరిపోదా శనివారం

ABN, Publish Date - Aug 25 , 2024 | 10:44 PM

ఆగస్ట్ 29న పోతారు.. అందరూ పోతారు. అందరూ థియేటర్‌కు పోతారని అన్నారు నేచురల్ స్టార్ నాని, ఆయన హీరోగా నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Saripodhaa Sanivaaram Pre Release Event

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం హైదరాబాద్‌గా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు దేవకట్టా, శ్రీకాంత్, సుధాకర్ చెరుకూరి, శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ, ఎస్.జె. సూర్య, ప్రియాంక అరుణ్ మోహన్, కెమెరామెన్ మురళీ, సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ తదితరులంతా హాజరయ్యారు. (Saripodhaa Sanivaaram Pre Release Event)

Also Read- Chiru- Balayya: చిరుని ఆప్యాయంగా పిలిచిన బాలయ్య.. మాటిచ్చేసిన చిరు!

ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. (Nani Speech) ‘‘ఈ వేడుకకు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. త్వరలో తెలుస్తుంది మీకు. సినిమా గురించి చాలా చెప్పేశాను. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ట్రైలర్‌లో చిన్నగా అరిశాను. ఈనెల 29న అందరూ అంతరేంజ్‌లో సక్సెస్ ఇవ్వాలి. వివేక్ ఏమి తీశాడో 29న మీకే తెలుస్తుంది. వివేక్ శివతాండవం ఈ సినిమాలో చూపించాడు. ఇది వివేక్‌కు మైల్ స్టోన్‌లా వుంటుంది. మా కష్టాన్ని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. జేక్స్ నా ఫ్యాన్. టెన్షన్ వున్నప్పుడు జేక్స్ ఆర్.ఆర్. వింటే రిలీఫ్‌గా వుంటుంది. సినిమాటో‌గ్రాఫర్ మురళీ చాలా కేర్ తీసుకుని టేక్స్ ఎన్ని అయినా కాంప్రమైజ్ కాలేదు. ఇక ఎడిటింగ్ చాలా అద్భుతంగా చేశాడు.


ఈ సినిమాలో సోకుల పాలెం సెట్ అనేది రియల్ లొకేషన్‌లా ఆర్ట్ డైరెక్టర్ చేశాడు. మా నిర్మాత దానయ్యగారికి ఏ సినిమాకూ కథ తెలియదు. లొకేషన్‌కు వచ్చి అన్నీ మీరే చూసుకోండని అంటారు. కానీ ఆయనకు అదృష్టం వుంది. అందుకే ‘సరిపోదా శనివారం, ఓజీ’ లాంటి కథలు ఆయన్ను వెతుక్కుంటూ వస్తాయి. వివేక్‌తో పనిచేయాలంటే టీమ్ చాలా కష్టపడాలి. ఈ సినిమా సక్సెస్‌లో అందరికీ భాగం వుంది. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులకు చెప్పాలంటే, కలిసొచ్చే కాలం వస్తే నడిచివచ్చే సినిమా వస్తుందంటారు.. అలాంటి సినిమా సరిపోదా శనివారం.

ఇందులో సాయికుమార్‌గారు నాకు తండ్రిగా నటించారు కానీ బాబాయ్‌లా అనిపిస్తారు. ఆయనతో నటించడం పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి. అభిరామి, అతిది తదితరులు చక్కగా నటించారు. అలీ ఇందులో భాగం అయ్యారు. ప్రియాంక‌ను ఆఫ్ స్క్రీన్‌లో ప్రేమలో పడతారు. ఈ సినిమాలో సూర్య, చారు పాత్రలను దర్శకుడు వివేక్ చక్కగా డీల్ చేశాడు. ఇక ఎస్.జె. సూర్య పాత్రకు మంచి పేరు వస్తుంది. దయా పాత్రకు ఆయనే సరియైన నటుడు. ఆగస్ట్ 29న పోతారు.. అందరూ పోతారు. అందరూ థియేటర్‌కు పోతారు. 29న సరిపోదా శనివారం చూస్తారు..’’ అని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 25 , 2024 | 10:44 PM