Laggam: ‘లగ్గం’ రిలీజ్ డేట్ ఫిక్సయింది..

ABN, Publish Date - Sep 15 , 2024 | 07:13 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు కథ- మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల. తెలంగాణ నేపథ్యంలో జరిగే అచ్చమైన తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌.. సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా.. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ‘లగ్గం’ విడుదల ఎప్పుడంటే..

Laggam Movie Still

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన సినిమా ‘లగ్గం’ (Laggam). ఈ సినిమాకు కథ- మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల (Ramesh Cheppala). తెలంగాణ నేపథ్యంలో జరిగే అచ్చమైన తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌.. సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా.. సినిమా విడుదల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారని అంటున్నారు మేకర్స్. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. (Laggam Movie Release Date)

Also Read- Manchu Family: మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది..


ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ‘లగ్గం’ సినిమాను అక్టోబర్ 18న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నామని తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరోయిన్ ప్రగ్యా నగ్రా చక్కని చీరకట్టులో రొమాంటిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక విడుదల తేదీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. చక్కటి కథ, కథనం, వినసొంపైన సంగీతం, మనుషుల భావోద్వేగాలు, కుటుంబ విలువలు ‘లగ్గం’ సినిమాలో ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఈ సినిమా చూసిన తర్వాత చాలా గొప్పగా మాట్లాడుకుంటారని అన్నారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి చూడాలని ఆయన కోరారు. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాగా ‘లగ్గం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అన్నారు నటకిరీటి రాజేంద్రప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం చరణ్ అర్జున్ అందిస్తుండగా.. స్వరబ్రహ్మ మణిశర్మ నేపధ్య సంగీతం అందిస్తున్నారు.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 15 , 2024 | 07:13 PM