Ka: హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమా రైట్స్ ఎవరికంటే..

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:48 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. ఈ సినిమా తెలుగు స్టేట్స్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. ఆయన ఈ సినిమాను రూ. 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్‌లో హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Kiran Abbavaram in Ka Movie

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’ (Ka Movie). ఈ సినిమా తెలుగు స్టేట్స్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి (Vamsi Nandipati). ఆయన ఈ సినిమాను రూ. 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్‌లో హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉంది. దీంతో 30 కోట్ల రూపాయలపైనే ‘క’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందనేలా టాలీవుడ్‌లో టాక్ మొదలైంది. (Ka Movie AP and TG Theatrical Rights)

Also Read- 30 Years Prudhvi: ఢిల్లీలో జగన్‌ని ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని అభినందించా..


రీసెంట్‌గా విడుదలైన ‘క’ టీజర్ (Ka Teaser) మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. ఒక వైవిధ్యభరిత చిత్రంగా ఈ సినిమా ఉండనుందనే ఫీల్‌ని ఇచ్చింది. అంతే, ఈ సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్‌లో ఏర్పడిన క్రేజ్‌కు ఈ డీల్ నెంబర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. కిరణ్ అబ్బవరం గత కొన్ని సినిమాలు సరైన విజయం సాధించకపోయినప్పటికీ.. ఈ రేంజ్‌లో అతని సినిమా రైట్స్ అమ్ముడుపోవడం అనేది విశేషమనే చెప్పుకోవాలి. ఈ సినిమాతో ఆయనకు కచ్చితంగా హిట్ వస్తుందనేలా టీజర్ హింట్ ఇస్తోన్న నేపథ్యంలో.. ఈ చిత్ర రైట్స్‌కు ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి.


Kiran-Abbavaram.jpg

‘క’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక (Nayan Sarika), తన్వీ రామ్ (Tanvi Raam) హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ తీసుకురాబోతున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 25 , 2024 | 04:48 PM

KA Movie Teaser: పోస్ట్ మేన్ గా వైవిధ్యమైన పాత్రలో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram- Rahasya: ఆ పిలుపు కోసం ఇంకా 38 రోజులు వేచి చూడాలి!

Kiran Abbavaram: 'క' సినిమాలో సెకండ్ హైయెస్ట్ పెయిడ్ ఎవరో తెలిస్తే షాకవుతారు

Kiran Abbavaram: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తా