KA Movie Teaser: పోస్ట్ మేన్ గా వైవిధ్యమైన పాత్రలో కిరణ్ అబ్బవరం

ABN, Publish Date - Jul 15 , 2024 | 12:33 PM

కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా అతను నటించిన 'క' సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. కిరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమా ఈ 'క'. దీనికి సుజీత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాత. టీజర్ చూస్తే ఈ సినిమాలో విషయం వున్నట్టుగా కనపడుతోంది, అలాగే ఇది వైవిధ్యమైన కథతో వస్తున్నట్టుగా కూడా అర్థం అవుతోంది. సాయంత్రం మూడు గంటలకే చీకటి పడుతున్న కృష్ణగిరి అనే వూరిలో ఏమి జరుగుతోంది. ఆ వూరిలో జరుగుతున్న మిస్టరీ ఏంటి. సినిమాలో పోస్ట్ మేన్ గా కనపడిన కిరణ్ అబ్బవరం చాలా కొత్తగా కనపడుతున్నాడు. అతను ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలో చేసిన పాత్రకి చాలా వైవిధ్యం కనపడుతోంది. పోస్ట్ మేన్ ఎందుకు ఇతరులకి వచ్చే ఉత్తరాలు చదువుతున్నారు, ఎవరు అతను, ఆ వూరు ఏదైనా పనిపైన వచ్చాడా? చాలా ఆసక్తికరంగా వున్న 'క' టీజర్. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా తెలుగుతో పాటు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదలవుతోంది.

Updated at - Jul 15 , 2024 | 12:33 PM