Kiran Abbavaram: ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తా

ABN , Publish Date - Jul 15 , 2024 | 10:13 PM

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిన ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ka

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా క (KA). నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి (Chinta Gopala Krishna Reddy ) భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్ (Sujith), సందీప్ (Sandeep) విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. "క" సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

GShfbSWWYAA7lIt.jpeg

ఈ కార్యక్రమంలో.. హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ - మా "క" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సతీష్ వేగేశ్న గారికి థ్యాంక్స్. మీ అందరినీ కలిసి ఏడాది అవుతోంది. మిగతా వారికి వన్ ఇయర్ అంటే ఎమో గానీ మనకు మాత్రం చాలా దూరం వచ్చిన ఫీల్ కలుగుతోంది. నేను ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణం ఉంది. ఎస్ఆర్ కల్యాణమండపం, రాజా వారు రాణిగారు సినిమాలు హిట్ అయ్యాయి. నన్ను మీరంతా ఆదరించారు ప్రేమించారు. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది. ఇంత ప్రేమ నాకు ఇచ్చారు. అలాంటి టైమ్ లో ఆగస్టులో అనుకుంటా ఐదు సినిమాలు సైన్ చేశా. అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఆ సినిమాల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బాగా సపోర్ట్ చేశారు.


ఇంకా మంచి మూవీ ఇవ్వాల్సింది అనే ఆలోచన కలిగింది. ఇంకా బెటర్ మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నా. నా మొదటి సినిమాల్లో బాగా నచించానని అన్నారు. ఆ తర్వాత సినిమాల్లో ఏంటి ఇలా చేశాడు అన్నారు. కానీ సెట్ లో ఏదైనా సీన్ బాగా రాకుంటే కరెక్ట్ ఎక్స్ ప్రెషన్ రాదు. నేను ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంటా. వీడి పని అయిపోయింది అని ఎవరైనా అంటే నమ్మకండి. నా పని అయిపోయింది అనిపించినప్పుడు సినిమాలు చేయను. నేను చాలా మంచి సినిమాలు చేస్తాను. నన్ను ప్రేమించిన మీ అందరి కోసం చేస్తాను. ఏ యంగ్ యాక్టర్ కు ఇవ్వనంత లవ్ నాకు మీరంతా ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను.

మా టీమ్ అంతా "క" సినిమాకు నేను పడిన కష్టాన్ని చెప్పారు. "క" సినిమా తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని మీరంతా చెప్పుకుంటారు. "క" అంటే కంటెంట్. ఆ కంటెంట్ ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. ఈ కథ విన్నప్పుడు వారు నాకొక మంచి ఆడియెన్స్ లా కనిపించారు. ఆడియెన్స్ దృష్టితోనే వారు కథను రాసినట్లు అనిపించింది. ఇప్పుడున్న టికెట్ రేట్స్, కాంపిటేషన్ లో ఎంతమంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తారు అనేది మా డైరెక్టర్స్ ఆలోచించారు.

GShfbRtXsAAhmnC.jpeg

మా డీవోపీలు సతీష్, విశ్వాస్, మా ఎడిటర్ ప్రసాద్, మా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్, మా కో ప్రొడ్యూసర్స్.. ఇలా టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా వర్క్ చేశారు. మా మూవీ సెట్ లోకి వెళ్తే పాజిటివ్ ఫీల్ కలిగేది. హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్ సపోర్టివ్ గా ఉన్నారు. ఇవాళ మా టీమ్ అంతా హ్యాపీగా మాట్లాడుతున్నాం అంటే కారణం మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాం. మమ్మల్ని మా ప్రాజెక్ట్ ను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన పుల్ సపోర్ట్ అందించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం.

ఈ ఏడాది మొదలై ఏడాదిన్నర అయ్యింది. ఇప్పుడు "క" ఫుటేజ్ చూసి బాగుంది అంటున్నాం గానీ మా ప్రొడ్యూసర్ గారు కథ విన్నప్పుడే సినిమా మీద నమ్మకం ఉంచారు. "క" తో ఒక మంచి మూవీ మీకు ఇవ్వబోతున్నా. మళ్లీ మీ ప్రేమ పొందేందుకు వేచి చూస్తున్నా. "క" ప్రొడక్షన్ వర్క్ అంతా రహస్య చూసుకుంది. సినిమా రీచ్ అయ్యాక మాట్లాడుతా అని చెప్పింది. అందుకే ఇక్కడికి రాలేదు. అన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 10:13 PM