KA: కిరణ్ అబ్బవరం ‘క’ షూటింగ్ అప్డేట్..

ABN, Publish Date - Sep 24 , 2024 | 10:43 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్‌ అప్డేట్‌ని తాజాగా మేకర్స్ తెలిపారు.

Ka Movie Still

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం ‘క’ (Ka Movie). ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌‘క’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Also Read-Pawan Kalyan: హీరో కార్తీ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ స్పందనిదే..


‘క’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. ఎన్నో అందమైన లొకేషన్స్, భారీ ప్రొడక్షన్ వేల్యూస్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో బ్యూటీఫుల్ ఆర్ట్ వర్క్‌తో ఈ సినిమాను అనుకున్న టైమ్‌కు పూర్తి చేయగలిగామని, ‘క’ సినిమా ఔట్ పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడిన నేపథ్యంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ‘క’ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్‌పై రిలీజ్ చేయబోతున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. (Ka Movie Shooting Update)

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 10:43 PM