మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Committee Kurrollu: నితిన్ వదిలిన ‘కమిటీ కుర్రోళ్ళు’ టీజర్.. బాల్యం గుర్తొస్తోంది

ABN, Publish Date - Jun 14 , 2024 | 09:05 PM

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ చిత్రానికి య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Committee Kurrollu Movie Still

పెరిగి పెద్దై బాధ్యతలను మోస్తున్న పెద్దవాళ్లనైనా, యువత అయినా ఏదో ఒక సందర్భంలో బాల్యమే బావుందని అనుకుంటాం. అలా అనుకోవటం కూడా నిజమే! ఎలాంటి పొరపచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఇప్పుడీ పాయింట్‌నే బేస్ చేసుకుని రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu). నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్నఈ చిత్రానికి య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. ప‌క్కా ప్లానింగ్‌తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయ‌టం విశేషం. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శుక్రవారం చిత్ర టీజర్‌‌ను విడుదల చేసింది. హీరో నితిన్ (Nithiin) సోషల్ మీడియా వేదికగా ఈ టీజర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ టీజర్‌ విషయానికి వస్తే.. కొంత మంది యువకులు వారి బాల్యాన్ని తలుచుకుంటే అప్పట్లో ఆటలు ఆడుకుంటూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరదాగా గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటారు. చిన్నతనంలో వాళ్లందరూ కలిసి ఓ ఇడ్లీ అంగల్లో ఇడ్లీలు తినటం, పంపు సెట్టు దగ్గర సరదాగా స్నానాలు చేయటం వంటి సన్నివేశాలను ఇందులో చూడొచ్చు. అలాగే టీనేజ్‌లో మనసుకు నచ్చిన అమ్మాయిలను ప్రేమించటం, ఆ సందర్బంలో జరిగిన కామెడీని వారు గుర్తుకు తెచ్చుకోవటం వంటి సన్నివేశాలను కూడా ఇందులో చూపించారు. అలాగే ఊర్లో జరిగే గొడవలను కూడా టచ్ చేశారు. అసలు సరదాగా ఉండాల్సిన యువత ఊళ్లో గొడవల్లో ఎందుకు తలదూర్చుతారు? ఆ గొడవల కారణంగా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాలనే విధంగా టీజర్‌ని కట్ చేశారు. ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. అందరినీ వారి బాల్యానికి తీసుకెళుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Committee Kurrollu Teaser Talk)

Updated Date - Jun 14 , 2024 | 09:05 PM