Harom Hara: జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:30 AM

సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సంసుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను దర్భంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను

Harom Hara: జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం

సుధీర్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను మహేశ్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసి, సుధీర్‌బాబుకు, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు దర్శకులు అనిల్‌ రావిపూడి, సంపత్‌ నంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘సుధీర్‌బాబు రాంబోలా ఉంటాడు. ఇందులో జేమ్స్‌బాండ్‌ ఇన్‌ కుప్పం అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. రాయలసీమ యాస లో సుధీర్‌బాబు అద్భుతంగా మాట్లాడారు. ఆయన కెరీర్‌లోనే ఇది బెగ్గెస్ట్‌ హిట్‌ కావాలి’ అని కోరారు. ‘ట్రైలర్‌ టెర్రిఫిక్‌గా ఉంది. విజువల్స్‌ బాగున్నాయి. సినిమా పెద్ద హిట్‌ కావాలి’ అన్నారు సంపత్‌ నంది. సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘యాక్షన్‌ సినిమా చేయమని కృష్ణగారు చాలా సార్లు చెప్పారు. ఈ సినిమా ఆయనకు ఆనందం కలిగిస్తుందని నమ్ముతున్నా. ఇండియన్‌ సినిమాలో ‘హరోం హర’ లాంటి బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమా రాలేదనే చెప్పాలి. యాక్షన్‌ సీన్లు టాప్‌ రేంజ్‌లో ఉంటాయి. నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. దర్శకుడు సాగర్‌ ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు’ అని చెప్పారు. జూన్‌ 14న సుధీర్‌బాబు మాస్‌ సంభవం చూడబోతున్నారని దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక చెప్పారు.

Updated Date - Jun 01 , 2024 | 02:52 PM