Double Ismart: ‘హను-మాన్’ నిర్మాతల చేతికి ‘డబుల్ ఇస్మార్ట్’.. ఇక ఊహించుకోండి

ABN, Publish Date - Jul 22 , 2024 | 09:36 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’‌పై బజ్ ఏ విధంగా ఉందో తెలిసిందే. ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్‌’ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్‌గా ఐదు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Ram in Double Ismart

ఉస్తాద్ రామ్ పోతినేని (Ustaad Ram Pothineni), డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh) డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)‌పై బజ్ ఏ విధంగా ఉందో తెలిసిందే. ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇది మ్యాసీవ్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్‌’కి సీక్వెల్‌గా రాబోతోంది. ప్రోమోలు ప్రామిస్ చేసినట్లు ఈ మూవీలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటుందనే క్లారిటీ వచ్చేసింది. ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్‌’ (Hanu-Man)ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్‌గా ఐదు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read- Prakash Raj: మళ్ళీ వివాదంలో ప్రకాష్ రాజ్, తెలుగు ప్రేక్షకులంటే చిన్న చూపు

‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్ట్ 15న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే గురువారం (స్వాతంత్ర్య దినోత్సవం), సోమవారం (రక్షా బంధన్) హాలీడేస్ తో 5 రోజుల వీకెండ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకు ఉండబోతోంది. దీంతో పాటు, ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషల వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ని ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (Prime Show Entertainment) (హను-మాన్ నిర్మాణ సంస్థ) నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారు. అంతేకాదు, ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు ఇప్పటికే వారు ప్రయత్నాలు మొదలెట్టినట్లుగా సమాచారం.


పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని జియానెలీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ అప్డేట్‌తో ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 22 , 2024 | 09:40 PM