Double Ismart Controversy: దర్శకుడు పూరి జగన్ కి బీఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్ !

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:49 PM

బీఆర్ఎస్ కార్యకర్తలు దర్శకుడు పూరి జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. నిన్న విడుదలైన 'మార్ ముంత చోడ్ చింత' పాట ఉంది కెసిఆర్ గొంతు తీయకపోతే పూరి జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. పూరి జగన్ ఒక సినిమాతో ఇలా వివాదంలో పడటం ఇది రెండోసారి. ఇంతకు ముందు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా అప్పుడు కూడా ఇలానే వివాదం అయింది.

BRS activists warning to director Puri Jagan

దర్శకుడు పూరి జగన్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా నుండి నిన్న 'మార్ ముంత చోడ్ చింత' అనే లిరికల్ పాటని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఛార్మి నిర్మాతగా ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతోంది. ఇందులో కావ్య థాపర్ కథానాయకురాలిగా నటిస్తోంది. ఈ సినిమా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వల్ గా వస్తోంది, కానీ అందులో నటించిన నభ నటేష్, నిధి అగర్వాల్ లు ఇందులో నటించడం లేదు. (BRS party activists gave strict warning to director Puri Jagan to remove KCR voice from the song released yesterday from the film Double Ismart)

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో వున్నారు, అలాగే ప్రచారాలు కూడా మొదలెట్టేశారు. అందులో భాగంగానే నిన్న ఈ 'మార్ ముంత చోడ్ చింత' అనే లిరికల్ పాటని విడుదల చేశారు. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గొంతు పెట్టడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. 'ఏం జెద్దామంటావ్ మరి' అనే కెసిఆర్ ప్రెస్ మీట్స్ లో చెప్పే ఊతపదం ఈ పాటలో పెట్టడం, ఈ పాట చాలా మాసీ గా ఉండటంతో పూరి జగన్ ని బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. (Puri Jagan is landed again in another controversy and this time BRS party activists gave strict warning to him)

doubleismartteaserone.jpg

ఇదేమీ మొదటి సారి కాదు, ఇంతకు ముందు కూడా పూరి జగన్ దర్శకత్వం వహించిన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాపై కూడా అప్పట్లో వివాదం నడించింది. ఆ సినిమా ఆడుతున్న థియేటర్స్ లో అప్పట్లో దాడులు చేసి వెండితెర చించారు, సినిమా ఆపేయాలని గొడవలు చేశారు. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత అదే పూరి జగన్ సినిమాని తెలంగాణాలో ఆడనివ్వం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇవ్వటం ఆసక్తికరం. (BRS party activists asked Puri Jagan to remove KCR voice from the song Maar Muntha Chod Chinta from the film Double Ismart)

ఇలా కెసిఆర్ గొంతుని ఒక చవకబారు పాటలో పెట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు నచ్చకపోవటంతో పూరి జగన్ కి వార్నింగ్ ఇవ్వటమే కాకుండా, ఆ పాటలో కెసిఆర్ గొంతుని తీయ్యకపోతే పూరి జగన్ ఇంటిని ముట్టడిస్తామని మహిళా కార్యకర్తలు చెపుతున్నారు. ఇంతకు ముందు కూడా పూరి జగన్ తెలంగాణ ఉద్యమంపై కించపరిచే విధంగా తన సినిమాలో పెట్టాడు అని, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో కూడా కెసిఆర్ ని కించపరిచే విధంగా పెట్టాడని, అవి తీయకపోతే తెలంగాణాలో సినిమా ఎలా విడుదల చేస్తాడో చూస్తామని హెచ్చరించారు. దీనిపై పూరి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Updated Date - Jul 17 , 2024 | 04:49 PM