Bharateeyudu 2: ‘భారతీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ABN, Publish Date - Jul 10 , 2024 | 06:35 PM
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబైంది. ఈ మూవీ అదనపు షోలకు, టికెట్ల రేటు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2). ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబైంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘భారతీయుడు 2’ చిత్రయూనిట్‌కు తెలంగాణ గవర్నమెంట్ (Telangana Government) గుడ్ న్యూస్ అందించింది.
Also Read- Raj Tharun: అబార్షన్ చేయించాడు.. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో కొత్త ట్విస్ట్
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విధించిన షరతు ప్రకారం.. డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ మేకర్స్ వీడియో విడుదల చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ చిత్రానికి టికెట్ల రేటును పెంచుకునే వెసులు బాటును కల్పిస్తూ.. తాజాగా జీవో విడుదల చేశారు. అంతేకాదు కాదు, ఓ వారం పాటు అదనపు షోకు కూడా అనుమతులిచ్చారు. జీవో ప్రకారం జూలై 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 5వ ఆటకు అనుమతిని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్ రేటును రూ. 75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50లను పెంచుకునేలా అనుమతులను జారీ చేసింది. అయితే సినిమా ప్రారంభానికి ముందు మాత్రం డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా వీడియోను ప్రదర్శించాలనే షరతుతో ఈ అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. మరోవైపు ఏపీలోనూ ఈ చిత్రానికి అన్నివిధాలా అనుమతులు లభిస్తాయని డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా నిర్మాత సురేష్ బాబు తెలిపారు.
‘భారతీయుడు2’ విషయానికి వస్తే.. శంకర్, కమల్ కాంబినేషన్‌లో 1996లో వచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘భారతీయుడు’ (Bharateeyudu) చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Latest Cinema News