Bharateeyudu2 Trailer: సేనాప‌తి స్వైర విహారం.. బాక్సాఫీస్ బద్దలే..

ABN , Publish Date - Jun 25 , 2024 | 08:22 PM

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జీరో టాల‌రెన్స్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Bharateeyudu2 Trailer: సేనాప‌తి స్వైర విహారం.. బాక్సాఫీస్ బద్దలే..
Bharateeyudu2 Movie Still

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan), సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Director Shankar) కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ (Lyca Productions)తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై (RedGaint Movies) సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’ (Bharateeyudu2). జీరో టాల‌రెన్స్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మేకర్స్ ‘భారతీయుడు 2’ ట్రైల‌ర్‌ను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు.

Also Read- Pawan Kalyan Varahi Deeksha: వారాహి దీక్ష ఎందుకు చేస్తారంటే..

ట్రైల‌ర్‌ విషయానికి వస్తే (Bharateeyudu2 Trailer Talk)... ‘ఊరేరా ఇది.. చ‌దువుకు త‌గ్గ జాబ్ లేదు.. జాబ్‌కు త‌గ్గ జీతం లేదు.. క‌ట్టిన ట్యాక్స్‌కు త‌గిన‌ట్లు సౌక‌ర్యాలు లేవు.. దొంగ‌లించేవాడు దొంగ‌లిస్తూనే ఉన్నాడు, త‌ప్పు చేస్తున్న‌వాడు త‌ప్పు చేస్తూనే ఉంటాడు’ అని ఓ మ‌హిళ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తుండగా.. మ‌రో వైపు హీరో సిద్ధార్థ్ ‘మ‌నం ఒక్కొక్క‌రినీ త‌ప్పు ప‌డుతూనే ఉంటాం. సిస్ట‌మ్ స‌రిగా లేదు.. స‌రి చేయాల‌ని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటాం. కానీ దాన్ని స‌రి చేయ‌టానికి కొంచెం కూడా ప్ర‌య‌త్నించ‌టం లేదు’ అని త‌న బాధ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఈ నేపథ్యంలో కొంత మంది యువ‌త రోడ్ల పైకి వ‌చ్చి పోరాటం చేస్తుంటే పోలీసులు వారిపై కాల్పులు జ‌రుపుతారు. ‘మ‌నం మొరిగే కుక్క‌లం మాత్ర‌మే.. అందుకే అరుస్తున్నా’ అని అందులో ఓ యువ‌కుడు త‌న ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతాడు. ఇలా దేశ‌మంతా అల్ల‌ర్లతో అట్టుడికి పోతుంటుంది. ఆ స‌మ‌యంలో వీరంద‌రినీ చీల్చి చెండాడే ఓ వేట కుక్క రావాలి అని సిద్ధార్థ్ అంటాడు. అలా ఎవ‌రుంటార్రా అని ప్రియా భ‌వానీ శంక‌ర్ అంటే.. ఉండేవారు అని సిద్ధార్థ్ స‌మాధానం చెబుతాడు. ఆయ‌నే మ‌ళ్లీ రావాలి. ఓ త‌ప్పు చేస్తే దాన్నుంచి త‌ప్పించుకోలేమ‌నే భ‌యం రావాలి అంటూ సిద్ధార్థ్ చెబుతాడు. అప్పుడు సేనాప‌తి (క‌మ‌ల్ హాస‌న్) ఎంట్రీ. పార్ట్ వ‌న్ భార‌తీయుడులో ఆయ‌నేం చేశాడ‌నే దాన్ని సింపుల్‌గా చూపించారు. (Indian2 Trailer)


సేనాప‌తి త‌నొక ఫ్రీడ‌మ్ ఫైట‌ర్‌గా త‌న గురించి చెబుతూ ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను అనే ప‌వ‌ర్‌ఫుల్, ఎమోష‌న‌ల్ డైలాగ్స్ ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నాయి. ఇక ట్రైల‌ర్‌లో సేనాప‌తి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాలు, వాటిని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించిన శంక‌ర్ మేకింగ్ స్టైల్ నెక్ట్స్ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనేలా ఆస‌క్తికరంగా ట్రైలర్‌ని కట్ చేశారు. సేనాప‌తి పాత్ర‌తో పాటు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇక మ‌ర్మ‌క‌ళ‌తో విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్ట‌డాన్ని కూడా ఈ సినిమాలో మ‌రింత విస్తృతంగా చూపించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, అనిరుద్ సంగీతం, నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను మ‌రో లెవ‌ల్‌లో ఆవిష్క‌రించాయి. దీంతో సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డుల బద్దలు కొట్టబోతున్నాడనేది ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేస్తోంది.

senapathi.jpg

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జరుగుతున్నాయి.

Read Latest Cinema News

Updated Date - Jun 25 , 2024 | 08:22 PM