Siddharth: సిద్ధార్ధ్.. నీ అతి తగ్గించుకుంటే మంచిది..

ABN , Publish Date - Jul 09 , 2024 | 10:28 AM

హైదరాబాద్‌లో జరిగిన ‘భారతీయుడు 2’ మీడియా సమావేశంలో చేసిన అతికి హీరో సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పారు. మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నను సరిగా అర్థం చేసుకోకుండా.. తన యాటిడ్యూట్ ప్రదర్శించిన సిద్ధార్థ్.. మీడియా సమావేశం అనంతరం తన మిస్టేక్‌కు క్షమాపణలు చెప్పారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ‘భారతీయుడు2’ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

Hero Siddharth

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan), సంచలన దర్శకుడు శంకర్ (Director Shankar) కాంబినేషన్‌లో రెడ్ జెయింట్ బ్యానర్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం ‘భారతీయుడు 2’ (Bharateeyudu2). ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రం జూలై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడులయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు అన్ని ఏరియాలలో యూనిట్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన మేకర్స్.. సోమవారం మీడియాకు ప్రత్యేకంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో హీరో సిద్ధార్ధ్ చేసిన అతి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా మారింది.

మరీ ముఖ్యంగా సిద్ధార్ధ్‌కి తెలుగు మీడియా అంటే చులకనా? లేదంటే భయమా? ఎందుకంత అతి చేస్తున్నాడని.. ఈ ప్రెస్ మీట్‌లో ఆయన ప్రవర్తనని చూసిన వారంతా అనుకోవడం గమనార్హం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అన్నాక.. చాలా ఓర్పుగా సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నకు ఇక్కడ తావులేదు. కమల్, రకుల్ మీరు స్పందించాల్సిన అవసరం లేదని సిద్ధార్ధ్ ఎలా చెబుతాడు. అసలీ సినిమాకు హీరో ఎవరు? కమల్ హాసనా? లేక సిద్ధార్ధా? ఎందుకంత అతి పోతున్నాడు. ఇప్పుడే కాదు.. గతంలో కూడా సిద్ధార్ధ్ ఇలాంటి ప్రవర్తనతోనే సినిమాలు లేక మూలన కూర్చున్నాడు. స్టార్ హీరో అవ్వాల్సినవాడు చేజేతులా తన కెరీర్‌ని నాశనం చేసుకోవడానికి ప్రధాన కారణం తన యాటిడ్యూడే అని తనని అభిమానించే వారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. (Hero Siddharth Attitude)

Also Read-Dhanush: 20 ఏళ్ల కష్టార్జితమే పోయెస్‌ గార్డెన్‌ ఇల్లు


Indian2.jpg

విషయంలోకి వస్తే.. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మీట్‌లో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినిమా ఇండస్ట్రీపై విధించిన షరతును ఓ మీడియా పర్సన్ గుర్తు చేశారు. ఇకపై స్టార్ హీరోలందరూ డ్రగ్స్, సైబర్ క్రైమ్ వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు కదా.. మరి అలాంటివి ఏమైనా చేస్తున్నారా? అని మీడియా పర్సన్ చిత్ర టీమ్‌ని ప్రశ్నించారు. ఈ ప్రశ్న సిద్ధార్థ్‌కి ఏమని అర్థమైందో.. అసలు అర్థమే చేసుకోకుండా ఏదేదో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ ప్రశ్నపై మీరు స్పందించాల్సిన అవసరం లేదంటూ కమల్, రకుల్‌కు చెప్పడం మరింత విడ్డూరం.

కమల్ హాసన్ (Kamal Haasan) వంటి స్టార్ హీరో ఈ విషయంపై మాట్లాడితే చాలా బాగుండేది. అందరికీ మంచి మెసేజ్ ఇచ్చినట్లు అయ్యేది. అలాగే ఇటీవల రకుల్ కూడా డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంది. ఆమె ఈ విషయంపై ఎలా రియాక్ట్ అయ్యుండేదో తెలిసేది. కానీ, సిద్ధార్ధ్ తనని డ్రగ్స్ గురించి ప్రశ్న అడుగుతున్నారేమో అన్నట్లుగా.. ఇది అప్రస్తుతం.. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి.. ఇది చేస్తేనే అది చేస్తాం అని ప్రశ్నించలేదు.. అంటూ సీఎం రేవంత్‌ని కూడా అవమానించేలా తన యాటిడ్యూట్ ప్రదర్శించాడు. తను చెప్పకపోయినా పర్లేదు కానీ.. మిగతావారిని మీరు చెప్పాల్సిన అవసరం లేదని అనడం ఏంటి? ఇప్పుడే కాదు, ఇంతకు ముందు ఓ ప్రెస్ మీట్‌లో కూడా తెలుగు మీడియాని చాలా చులకనగా చూస్తూ కామెంట్స్ చేశాడు. తనకి ప్రశ్న అర్థం కాకపోతే మరోసారి అడగాలి. అంతేకానీ, మీడియా తననేదో టార్గెట్ చేస్తుందనే భావనలో ఉంటే.. అది ఎవరి మిస్టేకో ఇకనైనా సిద్ధార్ధ్ అర్థం చేసుకోవాలి.

మళ్లీ మీడియా సమావేశంలో తను అన్న మాటలని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఎందుకో. ఇప్పుడర్థమైందా? మీడియా పర్సన్ అడిగిన ప్రశ్న. సారీ చెబుతూ ఓ వీడియోని విడుదల చేశావంటే.. ఎంతగా మీడియా సమావేశంలో యాటిడ్యూట్ ప్రదర్శించావో ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి సిద్ధార్థ్. ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకో..

Read Latest Cinema News

Updated Date - Jul 09 , 2024 | 12:08 PM

Bharateeyudu 2 An Intro: ‘భారతీయుడు 2’ ఇంట్రో తెలుగు టీజర్

Bharateeyudu 2: భారతీయుడు ఈజ్ బ్యాక్.. ఇక లంచగొండులకు మూడినట్టే!

Bharateeyudu 2: సిద్ధార్థ్, రకుల్‌ల ప్రేమ పాట ‘చెంగల్వ చేయందేనా..’ వచ్చేసింది

Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ నుంచి.. ‘క్యాలెండర్’ లిరికల్ సాంగ్ రిలీజ్

Bharateeyudu2 Trailer: సేనాప‌తి స్వైర విహారం.. బాక్సాఫీస్ బద్దలే..