Avika Gor: ‘ష‌ణ్ముఖ’లో అవికా గోర్ ఎంత అందంగా ఉందో..

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:35 PM

ఆది సాయికుమార్, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘ష‌ణ్ముఖ’. ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అవికాగోర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

Avika Gor: ‘ష‌ణ్ముఖ’లో అవికా గోర్ ఎంత అందంగా ఉందో..
Avika Gor in Shanmukha

వైవిధ్య‌మైన చిత్రాల‌కు, విభిన్న‌మైన క‌థ‌ల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తుంటారనే విషయం ఇప్పటికే ఎన్నో సినిమాల విషయంలో నిరూపితమైంది. ఇప్పుడా కోవ‌లోనే రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘ష‌ణ్ముఖ’ (Shanmukha). ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar), అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. ‘శాస‌న‌స‌భ’ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన చివ‌రి షెడ్యూల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న అవికాగోర్ (Avika Gor) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. (HBD Avika Gor)

Also Read- Rao Ramesh: ఏపీ అభివృద్ధిలో భాగమైన నటుడు రావు రమేష్.. ఆ నియోజకవర్గానికి విరాళం


Avika.jpg

ఈ లుక్‌లో అవికా గోర్ చూడ ముచ్చటగా ఉంది. తెలుగుదనం ఉట్టిపడేలా.. చక్కని సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. అవికా గోర్ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా ఉండేలా అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో క‌థానాయిక అవికాగోర్ సారాగా సాహ‌సోపేత‌మైన ప‌నులు చేసే శ‌క్తివంత‌మైన అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. లక్ష్య సాధ‌న‌లో ఆది పాత్ర‌కు స‌పోర్ట్ చేస్తూ ఆయ‌నకు తోడుగా నిలిచే పాత్ర‌ ఆమెది. త‌ప్పకుండా ఆమె కెరీర్‌లో ఈ పాత్ర, సినిమా మ‌రిచిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది. ఈ చిత్రంలో అవికాగోర్ త‌న న‌ట‌న‌తో అంద‌రి హృద‌యాల‌ను హ‌త్త‌ుకుంటుంది. త్వరలోనే చిత్ర విడుదల వివరాలను ప్రకటిస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 30 , 2024 | 11:35 PM