Shanmukha: ఆది సాయికుమార్ ‘ష‌ణ్ముఖ’ అప్డేట్ ఇదే..

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:19 PM

ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతోన్న వైవిధ్య‌భరిత చిత్రం ‘షణ్ముఖ’. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా.. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అవికాగోర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు.

Shanmukha: ఆది సాయికుమార్ ‘ష‌ణ్ముఖ’ అప్డేట్ ఇదే..
Shanmukha Movie Team

ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా తెరకెక్కుతోన్న వైవిధ్య‌భరిత చిత్రం ‘షణ్ముఖ’ (Shanmukha). డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా.. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అవికాగోర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ష‌ణ్ముగం సాప్ప‌ని (Shanmugam Sappani) ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ‘శాస‌న‌స‌భ’ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికీ సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ ముగించుకుని షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Shanmukha Update)

Also Read- Pawan Kalyan Varahi Deeksha: వారాహి దీక్ష ఎందుకు చేస్తారంటే..


Shanmukha.jpg

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ష‌ణ్ముగం సాప్ప‌ని మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్భుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఈ చిత్రం కోసం ఎంతో రిచ్‌గా వేసిన ఓ సెట్‌లో చివ‌రి షెడ్యూల్‌ను పూర్తిచేశాం. ‘కేజీఎఫ్‌, స‌లార్’ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బస్రూర్ (Ravi Basrur) ఈ చిత్రానికి స్ట‌న్నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులను మొదలుపెట్టబోతున్నాం. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌ురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాము.. అని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jun 25 , 2024 | 05:19 PM