Avika Gor : 'ఏం చేస్తున్నారు మీరు' అని గట్టిగా అరవడంతో..
ABN , Publish Date - Jun 18 , 2024 | 04:50 PM
బాలికా వధూ (Balika vadhu) సీరియల్‌లో చిన్నతనంలో పాపురల్ అయింది అవికా గోర్. ఆ సీరియల్‌తో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆనంది పాత్రతో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంది.
బాలికా వధూ (Balika vadhu) సీరియల్‌లో చిన్నతనంలో పాపురల్ అయింది అవికా గోర్. ఆ సీరియల్‌తో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆనంది పాత్రతో బుల్లితెర వీక్షకులను ఆకట్టుకుంది. తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి ఆ పేరును కొనసాగించింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది అవికా.
"ఈ మధ్యకాలంలో విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనక నుంచి టచ్ చేసినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా చెప్పలేని చోట తాకే ప్రయత్నం చేశాడు. అది గమనించి వెంటనే చేయి పట్టుకున్నాను. ‘ఏం చేస్తున్నారు మీరు’ అని గట్టిగా అరిచాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. నాకు ధైౖర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని కొట్టేదాన్ని. కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేేస కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు’ అని అన్నారు.