Average Student Nani: ‘రాలే పువ్వే’.. ఇద్దరు భామలతో మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ అదిరింది...

ABN , Publish Date - Jul 30 , 2024 | 10:58 PM

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి తన రెండో చిత్రంతో దర్శకుడిగానే కాకుండా.. హీరోగానూ పరిచయం అవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘రాలే పువ్వే’ అనే వీడియో సాంగ్‌ను వదిలారు.

Average Student Nani Movie Still

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri) తన రెండో చిత్రంతో దర్శకుడిగానే కాకుండా.. హీరోగానూ పరిచయం అవుతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani). ఈ సినిమా ఆగస్ట్ 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుస బెట్టి కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ సినిమాపై బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా మాంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను మేకర్స్ విడుదల చేశారు.


Heroines.jpg

‘‘రాలే పువ్వే (Raale Puvve).. మళ్లీ పూశానన్నదే..

సందే చూస్తే.. పోయే ప్రాణం వస్తదే..

చెల్ చెల్ చెల్ చెలరేగే.. అనువు అనువున కసి తలపే..

వల వల వలవిసిరే.. వయసే తెలిసే..’’ అంటూ సాగే ఈ పాటలో ఇద్దరి హీరోయిన్లతో హీరో మాస్ స్టెప్స్ వేస్తూ.. మాస్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్‌.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. హీరోయిన్లు స్నేహా, సాహిబా అందాలకు కుర్రకారు ఫిదా అవ్వడం గ్యారెంటీ అనేలా పాటను పిక్చరైజ్ చేశారు. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్ బి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2024 | 10:58 PM

Average Student Nani: అయ్యబాబోయ్.. ఆ ఫస్ట్ లుక్ ఏంటి?

Average Student Nani: హీరోగా మ‌రో ద‌ర్శ‌కుడు.. ఆకట్టుకుంటోన్న‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మోషన్ పోస్టర్

Average Student Nani: ‘ఏమైందో మనసే’ అంటోన్న యావరేజ్ స్టూడెంట్

Average Student Nani: ‘కాలేజ్‌లోనే నాని.. ఆ తర్వాత మాత్రం..’

Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ టీజర్