మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Manam: ‘మనం’కు పదేళ్ళు పూర్తి.. మే 23న మరొక్కసారి!

ABN, Publish Date - May 17 , 2024 | 06:05 PM

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మనం’. 23 మే, 2014న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ఈ మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ANR in Manam Movie

లెజెండరీ అక్కినేని నాగేశ్వరరావు (ANR), కింగ్ నాగార్జున (King Nagarjuna), నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil) క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మనం’ (Manam). 23 మే, 2014న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ క్లాసిక్‌ మూవీగా నిలిచింది. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ క్లాసిక్ ఎంటర్‌టైనర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 23న రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. (Manam Movie Completes 10 Years)

*Devara Part 1: ‘దేవర’ మూవీ ‘ఫియర్’ సాంగ్ ప్రోమో


ఈ మ్యాజికల్ అప్డేట్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సోషల్ మీడియాలో పంచుకుంటూ..‘‘ ‘మనం’ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రం. థియేటర్లలో మరోసారి సెలబ్రేట్ చేసుకుందాం’’ అని పేర్కొన్నారు. ‘‘ ‘మనం’ నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 10 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడానికి తిరిగి థియేటర్లలోకి తీసుకువస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది #ANRLivesOn’’ అని హీరో నాగ చైతన్య (Naga Chaitanya) ట్వీట్ చేశారు.


అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని (Akkineni Family Film) మూడు తరాల హీరోలు కలసి తెరపై కనిపించడం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన ఆల్బమ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులని మరోసారి ఈ సినిమా మెస్మరైజ్ చేయబోతోంది.

Read Latest Cinema News

Updated Date - May 17 , 2024 | 06:05 PM