King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-09-20T16:12:59+05:30 IST

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారని అక్కినేని నాగార్జున అన్నారు.

King Nagarjuna: ఆవిష్కరించే వరకు నాన్న విగ్రహాన్ని చూడలేదు.. ఎందుకంటే?
King Nagarjuna

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు (ANR Centenary Celebrations) బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్‌ చరణ్‌, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, అల్లు అరవింద్‌, అశ్వినీదత్, దిల్‌ రాజు, మురళీమోహన్‌, సుబ్బరామిరెడ్డి, నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్‌, జయసుధ, బ్రహ్మానందం, సి కళ్యాణ్, చినబాబు, నాగవంశీ, ఎస్ గోపాల్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు పాల్గొని అక్కినేని నాగేశ్వరరావు‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

విగ్రహావిష్కరణ అనంతరం కింగ్ నాగార్జున (King Nagarjuna) మాట్లాడుతూ.. ‘‘నాకు ఎవరి విగ్రహాన్ని అయినా చూస్తే .. ‘ఆయన గొప్ప వ్యక్తి, ఇప్పుడు మనతో లేరు’ అనే భావన కలుగుతుంది. చిన్నప్పటి నుంచి నా మనసులో ఇది ముద్రపడిపోయింది. విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అందుకే నాన్న గారి విగ్రహాన్ని వెంకయ్య నాయుడు‌గారు ఆవిష్కరించేవరకూ చూడలేదు. ఎందుకంటే.. నాన్న గారు లేరనేది యాక్సప్ట్ చేయాలని. శిల్పి వినీత్ అద్భుతంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నాన్నగారు అద్భుతమైన జీవితాన్ని గడిపారు. మీ అందరికీ నాన్న గారు అద్భుతమైన నటుడు, తరతరాలు గుర్తుపెట్టుకునే పాత్రలు చేసిన నటుడు, కోట్లమంది తెలుగు ప్రజలు ప్రేమించిన వ్యక్తి. మాకు మాత్రం నాన్నగారు మా గుండెలను నాన్న ప్రేమతో నింపారు. చిరునవ్వుతో మమ్మల్ని పిలిచే వ్యక్తి. సంతోషాన్ని, బాధను నాన్నతోనే పంచుకునే వాళ్లం. ఆయనతో కూర్చుంటే అన్ని బాధలు తీరిపోయేవి. (ANR Lives On)


ANR.jpg

అన్నపూర్ణ స్టూడియోస్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. నచ్చిన స్థలంలో విగ్రహం పెడితే ప్రాణప్రతిష్ట చేసినట్లు అంటారు. ఆయన ప్రాణంతో మా మధ్యలోనే నడుస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన మన అందరి మనసుల్లో జీవించే వుంటారు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడుగారు. ఎప్పుడు ఆహ్వానించినా ఆయన తప్పకుండా వస్తారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Chandramukhi 2: సెప్టెంబర్ 28న రిలీజ్‌కు అంతా రెడీ..

***************************************

*Shruti Haasan: శృతి హాసన్‌కి చెమటలు పట్టించిన అజ్ఞాత వ్యక్తి..

****************************************

*RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో‌ వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్

****************************************

*Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?

***************************************

Updated Date - 2023-09-20T16:12:59+05:30 IST