Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అజిత్ కుమార్ స్టన్నింగ్ పిక్ వైరల్
ABN, Publish Date - Oct 10 , 2024 | 07:30 PM
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే వైరల్ అవగా.. తాజాగా అజిత్ కుమార్ స్టన్నింగ్ పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అజిత్ కుమార్‌ని మూడు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా లొకేషన్ నుంచి అజిత్ కుమార్ స్టన్నింగ్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది.
Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్టయన్... ది హంటర్’ ఎలా ఉందంటే..
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాడ్రిడ్‌లో జరుగుతోంది. ఈ కీలకమైన షెడ్యూల్‌లో అజిత్ కుమార్, ఇతర నటీనటులపై చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా మేకర్స్ అజిత్ కుమార్ స్టన్నింగ్ లుక్‌ని రిలీజ్ చేశారు. వైట్ అండ్ వైట్ సూట్‌లో ఛార్మింగ్ స్మైల్‌లో డైనమిక్‌గా నిలబడి ఉన్న అజిత్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాల్‌తో ‘మార్క్ ఆంటోని’ చిత్రాన్ని చేసిన అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రెడీ చేస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన వెర్సటైల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనుందని మేకర్స్ చెబుతున్నారు. (Ajith Kumar in Good Bad Ugly)
Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ వాయిదా? ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వచ్చినా సమస్యే?
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ .ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది.