Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఎలక్ట్రిఫైయింగ్ సెకండ్ లుక్..

ABN , Publish Date - Jun 27 , 2024 | 09:29 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ హీరోగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ సెకండ్ లుక్‌ని విడుదల చేశారు.

Good Bad Ugly: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఎలక్ట్రిఫైయింగ్ సెకండ్ లుక్..
Good Bad Ugly Movie Still

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar) హీరోగా.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నుంచి ఎలక్ట్రిఫైయింగ్ సెకండ్ లుక్‌ (Good Bad Ugly Second Look)ని రిలీజ్ చేశారు.

Also Read- Kalki 2898AD Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక నటించిన సినిమా ఎలా ఉందంటే...

ఈ లుక్‌లో అజిత్ బ్లాక్ షేడ్స్ ధరించి ప్రిజనర్ యూనిఫామ్‌లో ఎలక్ట్రిఫైయింగ్ న్యూ అవతార్‌లో కనిపించిన ఈ పవర్ ప్యాక్డ్ లుక్ అదిరిపోయింది. అజిత్ చేతిపై వున్న టాటూ, బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యాసీవ్ గన్ ఫైరింగ్ స్టన్నింగ్‌గా వున్నాయి. అందరినీ ఆకట్టుకున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. (Good Bad Ugly Movie)


Ajith-Kumar.jpg

ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని అందిస్తున్నారు. అభినందన్ రామానుజం డీవోపీగా, విజయ్ వేలుకుట్టి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 27 , 2024 | 09:30 PM