Good Bad Ugly: అజిత్‌తో.. త్రిష వ‌న్స్‌మోర్‌

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:46 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టిస్తోన్న కొత్త చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అయితే.. ఈ సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం త్రిషను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

ajith

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar,) తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly). ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన‌ లుక్ పోస్ట‌ర్స్‌ మంచి స్పందనను రాబట్టుకోగా తాజాగా ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ajithgoodbadugly.jpg

అయితే.. ఈసినిమాలో ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం త్రిష(Trisha)ను ఎంపిక చేశారు. ఈ మేర‌కు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా పూర్తి చేశారు. త్వరలోనే అజిత్‌ - త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కించే సన్నివేశాలను షూట్‌ చేసేలా దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

GWhe6MsWEAAu6kO.jpeg


గ‌తంలో అజిత్‌ కుమార్‌, త్రిష కాంబినేషన్‌లో ‘జి’, ‘మంగాత్తా’, ‘ఎన్నై అరిందాల్‌’ వంటి చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ‘విడాముయర్చి’ చిత్రంలో అజిత్‌ సరసన నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుంది. ఇటీవల విశాలోతో బ్లాక్ బస్టర్ ‘మార్క్ ఆంటోని’ (Mark Antony)తో మంచి విజయాన్ని అందుకున్న అధిక్ రవిచంద్రన్ ఇప్పుడు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని తెరకెక్కిస్తున్నారు.

GWkDZHQXgAAspOa.jpeg

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్న ఇండియన్ సినిమాలలో ఒక హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతని నిర్వహిస్తారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ మూవీని 2025 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 04 , 2024 | 12:46 PM