Action King Arjun: అజిత్ ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ లుక్ విడుదల

ABN , Publish Date - Jul 28 , 2024 | 08:37 PM

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడు యాక్ష‌న్ కింగ్ అర్జున్‌. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ప్ర‌తినాయ‌కుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో అర్జున్ మెప్పించారు.. మెప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తోన్న ‘విడాముయ‌ర్చి’లో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌తో అలరించేందుకు అర్జున్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఆయన లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ వదిలారు.

Vidamuyarchi Movie Still

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడు యాక్ష‌న్ కింగ్ అర్జున్‌ (Action King Arjun). హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ప్ర‌తినాయ‌కుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో అర్జున్ మెప్పించారు.. మెప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) హీరోగా నటిస్తోన్న ‘విడాముయ‌ర్చి’లో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌తో అలరించేందుకు అర్జున్ రెడీ అవుతున్నారు. అజిత్‌ కుమార్‌ (Ajith Kumar), లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని (Magizh Thirumeni) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. భారీ అంచ‌నాల‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు.

Also Read- Maruthi Nagar Subramanyam Trailer: నవ్వకుండా ఉండగలరేమో.. ట్రై చేయండి


ఈ ఫస్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌లో అర్జున్ నిల‌బ‌డి ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడో క‌నిపిస్తోంది. అస‌లు అర్జున్‌కి, అజిత్ పాత్ర‌కు ఉన్న లింకేంట‌నే ఆస‌క్తిని పోస్ట‌ర్‌తో క్రియేట్ చేశారు మేక‌ర్స్‌. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వాక్యం మ‌రింత క్యూరియాసిటీని క‌లిగిస్తోంది. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని.. అజిత్‌తో ఈ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. (Action King Arjun in Vidamuyarchi)


Action-King.jpg

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలకానుంది.

Read Latest Cinema News

Updated Date - Jul 28 , 2024 | 08:37 PM