Vidaamuyarchi: అజిత్ ‘విడాముయ‌ర్చి’ పూర్తైంది.. ఇక విడుద‌లే మిగిలింది

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:38 PM

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్ , లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది.

ajith

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్ (Ajith Kumar), లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ చిత్రం ప్రారంభం నుంచే అంద‌రి దృష్టి ఈ సినిమాపై ఉంది. త‌న‌ కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించ‌గా .. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు క‌లిసి ఈ మూవీలో న‌టిస్తుండ‌డం విశేషం. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమా షూటింగ్‌ పూర్తి అయినట్టుగా నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అంతా కలిసి దిగిన ఫొటో సోష‌ళ్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే సినిమా నుంచి అజిత్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా సినిమాను దీపావ‌ళికి ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకువ‌చ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.


GTB0g5SbUAA9dSe.jpegకోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేశారు. ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా. ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 06:38 PM