Vidaamuyarchi: అజిత్ ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:33 PM

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్‌డేట్ వస్తుందా? అనే వారి కోసం ఆదివారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Vidaamuyarchi: అజిత్ ‘విడాముయ‌ర్చి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
Ajith Kumar in Vidaamuyarchi

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌ (Ajith Kumar), లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని (Magizh Thirumeni) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘విడాముయ‌ర్చి’ (Vidaamuyarchi). ఈ క్రేజీ కాంబోలో సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలో సినిమాపై భారీ అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్‌డేట్ వస్తుందా? అస‌లు సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉంటుంది.. మూవీ ఎలా ఆక‌ట్టుకోనుందంటూ అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం వ‌చ్చేసింది.. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా ‘విడాముయ‌ర్చి’ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆదివారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. (Vidaamuyarchi First Look)

Also Read- Rao Ramesh: ఏపీ అభివృద్ధిలో భాగమైన నటుడు రావు రమేష్.. ఆ నియోజకవర్గానికి విరాళం


‘విడాముయ‌ర్చి’ సినిమా ప్రారంభం నుంచి కోలీవుడ్ స‌హా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. టాప్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అందరూ ఈ సినిమాలో భాగ‌మ‌య్యారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ అధినేత సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. (Ajith Kumar in Vidaamuyarchi)


Vidaamuyarchi.jpg

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌ (Trisha), యాక్ష‌న్ కింగ్ అర్జున్ (Action King Arjun) త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి ఈ ముగ్గురు ‘విడాముయ‌ర్చి’లో ప్రేక్షకులను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది.

ఇక ఫస్ట్ లుక్ విడుదల సంద‌ర్భంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా విడాముయ‌ర్చి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌టం మా అంద‌రికీ ఎంతో ఆనందంగా ఉంది. అజిత్‌తో సినిమా చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అభిమానులు, ప్రేక్ష‌కులు వారి స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. వారికి చ‌క్క‌టి సినిమాను అందించ‌టమే మా ల‌క్ష్యం. అందుక‌నే మా టీమ్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆగ‌స్ట్ నెల‌లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తాం. త‌ర్వాతే సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంద‌నే దాని గురించి అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jun 30 , 2024 | 10:33 PM