Shanmukha: దీపావళికి వస్తానంటోన్న ‘షణ్ముఖ’

ABN, Publish Date - Sep 20 , 2024 | 09:58 PM

తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు ఈ మధ్య అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంటోన్న విషయం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరడానికి మరో పాన్‌ ఇండియా సూపర్‌ డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రెడీ అవుతుందని అంటున్నారు మేకర్స్. ఆ పాన్ ఇండియా సినిమా ఏదో కాదు.. ‘షణ్ముఖ’. తాజాగా ఈ మూవీ విడుదల వివరాలను మేకర్స్ తెలియజేశారు.

Aadi Saikumar and Avika Gor in Shanmukha

తెలుగులోనే కాకుండా ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు ఈ మధ్య అన్ని భాషల్లో మంచి ఆదరణ ఉంటోన్న విషయం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరడానికి మరో పాన్‌ ఇండియా సూపర్‌ డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ రెడీ అవుతుందని అంటున్నారు మేకర్స్. ఆ పాన్ ఇండియా సినిమా ఏదో కాదు.. ‘షణ్ముఖ’ (Shanmukha). ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) హీరో. అవికాగోర్ (Avika Gor) హీరోయిన్. ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. ‘శాస‌న‌స‌భ’ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికీ సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. (Shanmukha Release Update)

Also Read- Tirupati Controversy: ల‌డ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్


ఈ పోస్టర్‌‌ను గమనిస్తే.. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌‌లో ఆది హీరోయిక్ లుక్‌లో చూస్తుంటే.. హీరోయిన్ భయపడుతూ కనిపిస్తోంది. పక్కన ఓ దేవాలయం కనిపిస్తోంది. ఆ పక్కన ఉన్న వాతావరణం అది చూస్తుంటే.. ఓ యాక్షన్ ఎపిసోడ్‌లా అనిపిస్తోంది. ఒక వైపు ప్రేమ, మరోవైపు భక్తి అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై పాజిటివ్‌ వైబ్స్‌కి ఏర్పడేలా చేస్తుంది.

పోస్టర్ విడుదల సందర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. సినిమాలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ దీపావళి సీజన్‌లో ఫ్యామిలీ చూడదగ్గ డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. ‘కెజియఫ్, స‌లార్’ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి స్ట‌న్నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌ సమక్షంలో నిర్మాణానంత‌ర ప‌నులు చివరి దశకు చేరుకున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌ురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామని తెలిపారు.

Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య

Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే

Read Latest Cinema News

Updated Date - Sep 20 , 2024 | 09:58 PM