మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Niharika: అప్పుడు మహేష్, విజయ్‌లతో అలా చేసిన నిహారికకు ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్!

ABN, Publish Date - May 22 , 2024 | 12:06 PM

ఆ మధ్య మహేష్ బాబు, విజయ్ దేవరకొండ అడివి శేష్ వంటి హీరోల సినిమాల ప్రమోషన్స్ కోసం చేసిన ప్రత్యేక యాడ్స్‌లో నటించిన యూట్యూబర్ నిహారికను ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ వరించింది. హీరో అధర్వ నటించే కొత్త చిత్రంలో యూట్యూబ్‌ ఫేమ్ నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Niharika NM

హీరో అధర్వ (Hero Atharvaa) నటించే కొత్త చిత్రంలో యూట్యూబ్‌ ఫేమ్ నిహారిక (Niharika Nm) హీరోయిన్‌గా ఎంపికైంది. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాధారణంగా గతంలో సినిమాల్లో అవకాశాల కోసం ప్రత్యేక ఫొటో షూట్‌ చేసి.. ప్రతి నిర్మాణ కంపెనీ ఆఫీసుల చుట్టూత చెప్పులు అరిగిపోయేలా తిరిగేవారు. కానీ, ఇపుడు కాలం మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంతో మంది యువతీ యువకులు తమలోని ప్రతిభను సోషల్‌ మీడియా వేదికగా చూపిస్తున్నారు. వీటిని చూసిన దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి అవకాశమే యూ ట్యూబర్‌ నిహారికకు వరించింది. (Youtuber Turns Heroine)

*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు

హాస్యభరితంగా రీల్స్‌ చేసి, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మంచి గుర్తింపు పొందిన నిహారిక (Niharika)... ఇపుడు అధర్వ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కొత్త దర్శకుడు ఆకాష్‌ భాస్కరన్‌ రూపొందించే ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌ (Lyca Production) నిర్మించనుంది. ఇందులో నిహారిక న్యూయార్క్‌ యువతిగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా సింహ భాగం న్యూయార్క్‌లోనే జరుపుకోనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను త్వరలోనే అధికారికంగా లైకా ప్రొడక్షన్‌ వెల్లడించనుంది. ప్రస్తుతం నిహారిక అదృష్టాన్ని కోలీవుడ్ (Kollywood) అంతా కొనియాడుతోంది.


ఈ అవకాశం పట్ల నిహారిక స్పందిస్తూ.. ఇది అసలు ఊహించని పరిణామం అని తెలియజేసింది. ఆకాశంలో తేలుతున్నానని, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని, దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చింది. కాగా, ఆ మధ్య మహేష్ బాబు (Mahesh Babu), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అడివి శేష్ (Adivi Sesh) వంటి హీరోల సినిమాల ప్రమోషన్స్ కోసం చేసిన ప్రత్యేక యాడ్స్‌లోనూ నిహారిక నటించింది.

Read Latest Cinema News

Updated Date - May 22 , 2024 | 12:06 PM