Maidaan OTT: అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ ఓటీటీలోకి వచ్చేసింది కానీ.. కండీషన్స్ అప్లయ్!
ABN , Publish Date - May 22 , 2024 | 11:04 AM
అజయ్ దేవ్‌గణ్ హీరోగా బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మైదాన్’. రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే మాత్రం కొన్ని కండీషన్స్ అప్లయ్ అవుతాయి మరి.
అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgan) హీరోగా బోనీ కపూర్, జీ 5 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మైదాన్’ (Maidaan). రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి (Maidaan in OTT) వచ్చేసింది. కాకపోతే ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే మాత్రం కొన్ని కండీషన్స్ అప్లయ్ అవుతాయి మరి. అవేంటని అనుకుంటున్నారా? అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ ఈ సినిమా చూడాలంటే రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ప్రాతిపదికన ఈ సినిమాను అమెజాన్ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఇలా స్ట్రీమింగ్ చేసిన అనంతరం.. ఓటీటీలో అద్దె లేకుండానే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది.
*Hema: రేవ్ పార్టీ కవరింగ్ కోసం రెసిపీ.. హేమతో ఆడేసుకుంటోన్న నెటిజన్లు
అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ వంటి వారు కీలక పాత్రలలో నటించగా.. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కథ (Maidaan Movie Story) విషయానికి వస్తే.. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్‌లో భారత జట్టు యుగోస్లేవియా జట్టుతో తలపడి ఓటమి పాలవుతుంది. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతాయి. దీంతో.. అసలీ ఓటమికి కారణం ఏమిటనేది.. జట్టు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్(అజయ్ దేవగణ్) భారత్ ఫుట్ బాల్ ఫెడరేషన్‌కి వివరించే ప్రయత్నం చేస్తాడు. మళ్లీ కొత్త ఆటగాళ్లతో తన ప్రయత్నాన్ని మొదలెట్టి, మరో జట్టును సిద్ధం చేస్తాడీ హైదరాబాద్ ఆటగాడు. మరి ఈ జట్టైనా తదుపరి ఒలింపిక్స్‌లో విజయం సాధించిందా? ఈ క్రమంలో ఆటగాళ్లు, కోచ్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Read Latest Cinema News