Venu Swamy: వేణు స్వామి బండారం బట్టబయలు.. భలే ఇరుక్కున్నాడుగా!

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:14 PM

కొన్ని రోజులుగా వార్తలలో వైరల్ అవుతున్న వేణు స్వామి బండారం బట్టబయలైంది. ఆయనకిప్పుడు ఎక్కడా లేని కష్టం వచ్చిపడింది. అసలాయన జ్యోతిష్యుడా, కాదా? అనేది పక్కన పెడితే.. వేణు స్వామి అసలు బ్రాహ్మణుడే కాదనేలా.. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఆయన బ్రాహ్మణుడో, కాదో నిరూపించుకోవాలంటూ వేణు స్వామిపై బ్రాహ్మణ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

Siripurapu Sridhar Sharma and Venu Swamy

కొన్ని రోజులుగా వార్తలలో వైరల్ అవుతున్న వేణు స్వామి (Venu Swamy) బండారం బట్టబయలైంది. ఆయనకిప్పుడు ఎక్కడా లేని కష్టం వచ్చిపడింది. అసలాయన జ్యోతిష్యుడా, కాదా? అనేది పక్కన పెడితే.. వేణు స్వామి అసలు బ్రాహ్మణుడే కాదనేలా.. ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ మాట అంది మరెవరో కాదు.. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ (Siripurapu Sridhar Sharma). తాజాగా ఆయన వేణు స్వామి విషయమై ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో వేణు స్వామి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాటలు.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. (Venu Swamy Astrologer)

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం

బ్రాహ్మణ జాతిని కించపరిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడని.. వేణు స్వామి అసలు బ్రాహ్మణుడే కాదని తెలిపారు. ‘‘బ్రాహ్మణులకు చెందిన 72 శాఖలలో ఏ శాఖకి కూడా వేణు స్వామి చెందినవాడు కాదు. నిజంగా వేణు స్వామి బ్రాహ్మణుడే అయితే బయటికి వచ్చి నిరూపించుకోవాలి. బ్రాహ్మణుడి పేరుతో సినిమా వాళ్లను, రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను మోసం చేస్తున్నాడు. వేణు స్వామికి, బ్రాహ్మణ జాతికి ఎలాంటి సంబంధం లేదు. మరోసారి వేణు స్వామి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. వేణు స్వామి జాతకాలతో మోసపోకండి’’ అని శ్రీధర్ శర్మ ఈ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.


అసలు విషయం ఏమిటంటే.. ఈ మధ్య కాలంలో వేణు స్వామి జ్యోతిష్యం అంటూ హడావుడి చేయడం, హీరోయిన్లతో పూజలు, హీరోల భవిష్యత్ అంటూ నానా హడావుడి చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ, ఏపీ ఎన్నికలలో ఆయన చెప్పిన ఏ విషయం కూడా నిజం కాలేదు. అలాగే సినిమాలకు సంబంధించి ప్రభాస్ పెళ్లి, సినిమాల గురించి చెప్పిన మాటలు కూడా నిజంగా కాలేదు. జ్యోతిష్యం పరంగా ఆయన ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. దీంతో ఆయనని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రీసెంట్‌గా నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం అనంతరం ఆయన చెప్పిన జాతకంతో ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. శుభమా అంటూ వారు నిశ్చితార్థం చేసుకుంటే.. మరుసటి రోజు.. వారు కనుక పెళ్లి చేసుకుంటే.. కచ్చితంగా మూడు సంవత్సరాలలో విడిపోతారంటూ ఆయన చేసిన, చెప్పిన జాతకంతో.. జర్నలిస్ట్ సంఘాలు, అభిమానులు వేణు స్వామిపై ఫైర్ అవుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుండగా.. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం చూస్తుంటే.. వేణు స్వామి జాతకం ఏమంత బాగాలేదనే చెప్పుకోవాలి. చూద్దాం.. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో..

Read Latest Cinema News

Updated Date - Aug 23 , 2024 | 05:14 PM