Devara: ఎన్టీఆర్ డబ్బింగ్, జాన్వీ స్టయిలింగ్‌పై ట్రోలింగ్

ABN, Publish Date - Sep 13 , 2024 | 10:28 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. అదేంటంటే..

Devara Movie Stills

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొర‌టాల శివ (Koratala Siva) ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాపై ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఏ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుందో తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్ డబ్బింగ్ (Jr NTR Dubbing), జాన్వీ కపూర్ స్టయిలింగ్‌పై (Janhvi Kapoor Styling) కూడా భారీగా ట్రోలింగ్ నడుస్తోంది.

Also Read- Devara: ‘దేవర’పై అంచనాలు తప్పాయా.. యుఎస్‌కు వెళ్లిపోతున్న తారక్..

ఆ విషయంలోకి వస్తే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అనువాదమవుతోంది. మలయాళం మినహా మిగిలిన అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పినట్లుగా మేకర్స్ ప్రకటించారు. కన్నడ వెర్షన్ డబ్బింగ్ అయితే నాలుగు గంటల్లో ఎన్టీఆర్ ముగించారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నడ వెర్షన్ డబ్బింగ్‌కు ఐదు గంటల సమయం తీసుకుంటే.. ఈసారి ఓ గంట తక్కువగానే టైమ్ తీసుకుని పూర్తి చేశాడన్నది ప్రచారం యొక్క సారాశం. అయితే ఇదే ట్యాలెంట్ ఎన్టీఆర్ ఇతర వెర్షన్‌ల విషయంలోనూ చూపించి, త్వరత్వరగా డబ్బింగ్ పూర్తి చేసి ఉండవచ్చు గాక.. కానీ హిందీ వెర్షన్‌కు జూనియర్ ఇచ్చిన డబ్బింగ్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. హిందీ యాక్సెంట్ ఎన్టీఆర్ నోట వింటుంటే కామెడీగా ఉందని.. ట్రైలర్‌లో సీరియస్ మోడ్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్‌ చెబుతుంటే, నవ్వొస్తుందంటూ నార్త్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక ట్రైలర్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్ కనిపించిన తీరుపై కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ చీరకట్టు వ్యాంప్ పాత్ర మాదిరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది. హీరోయిన్ పక్కన ఉన్న ఆర్టిస్ట్‌ల డ్రెస్సింగ్‌తో పోలిస్తే జాన్వీ స్టయిలింగ్ ఎందుకంత అసహ్యంగా ఉంది.. కొంపదీసి కొరటాల దీనినే గ్లామర్ అనుకుంటున్నారా? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఏదో ఒక విషయంగా.. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ‘దేవర’ సినిమాపై ట్రోలింగ్ నడుస్తూనే ఉంది.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?


Also Read- Mathu Vadalara 2 Review: శ్రీసింహా నటించిన కామెడీ థ్రిల్లర్ 'మత్తు వదలరా 2' ఎలా ఉందంటే 

Read Latest Cinema News

Updated Date - Sep 13 , 2024 | 10:28 PM