Game Changer: అప్డేట్స్ లేవ్.. లీక్స్‌తోనే పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:41 PM

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండు వీడియోలు లీకై వైరలవుతున్నాయి.

Two Videos From Game Changer Leaked

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Global Star Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’ (Game Changer). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ (SVC) బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు కానీ.. షూటింగ్ సెట్స్ నుంచి లీకవుతోన్న వీడియోలతో ‘గేమ్ చేంజర్’ ట్యాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి రెండు వీడియోలు లీకయ్యాయి. (Two Videos From Game Changer Movie Leaked)

Also Read- Varalaxmi Couple: ఆమె ఫస్ట్ లవ్ నేను కాదు.. వరలక్ష్మి భర్త సంచలన వ్యాఖ్యలు

అందులో ఒకటి ఎయిర్‌పోర్ట్ సీన్‌ (Game Changer Airport Scene)గాక, రెండోది సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో. ఈ రెండు వీడియోలతో సోషల్ మీడియాని ఫ్యాన్స్ తగలెట్టేస్తున్నారు. ఎందుకంటే, నిర్మాణ సంస్థ నుంచి ఇంత వరకు సినిమా రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్ ఎంతగా అడుగుతున్నా.. మేకర్స్ మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు. అడగ్గా అడగ్గా.. ‘జరగండి’ అనే ఓ లిరికల్ సాంగ్‌ని, అదీ కూడా చెప్పిన టైమ్‌కి కాకుండా ఆ తర్వాత ఎప్పుడో రిలీజ్ చేశారు. అంతే, అప్పటి నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో లీక్‌డ్ వీడియోలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. (Game Changer Movie)


Ram-charan.jpg

ఈ లీక్‌డ్ వీడియోలను చూసిన మెగాభిమానులు (Mega Fans) పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ సీన్ గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయడంతో.. ‘గేమ్ చేంజర్’ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కాస్త ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారందరిలో ఈ ఎయిర్‌పోర్ట్ లీక్‌డ్ వీడియో హుషారును నింపుతోంది. కచ్చితంగా శంకర్ ఈసారి డిజప్పాయింట్ చేయడనే నమ్మకం వచ్చిందంటూ ఈ వీడియోకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. అప్డేట్ అడిగితే ఇవ్వరు కానీ.. ఇలా వీడియోలు లీక్ అవుతుంటే మాత్రం కామ్‌గా చూస్తూ కూర్చుంటారా? అని మేకర్స్‌ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఈ లీక్‌డ్ వీడియోలకే ఇంత హైప్ ఇస్తుంటే.. మేకర్స్ ఈ టైమ్‌లో ఏదైనా అప్డేట్ వదిలేతే మాత్రం.. మంచి బ్రేక్ ఇస్తామంటూ మరికొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Read Latest Cinema News

Updated Date - Jul 17 , 2024 | 12:45 PM

Game Changer Audio Rights : ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

Game Changer : పాట లీక్‌పై నిర్మాత దిల్‌రాజు ఫైర్‌

Game Changer Update: శంకర్ లేకపోయినా షూటింగ్ ఆగలేదు

Game Changer: మెగా మాస్‌ బ్లాస్ట్‌..వచ్చేస్తుంది

Game Changer: జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. జ‌ర‌గండి జ‌ర‌గండి పాటొచ్చింది