Game Changer Audio Rights : ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

ABN , First Publish Date - 2023-11-09T16:14:44+05:30 IST

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram charan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer). దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్‌ (shankar) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ సంస్థలో నిర్మితమవుతున్న 50వ చిత్రమిది. దిల్‌ రాజు , శిరీష్‌ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం నుంచి 'జరగండి.. జరగండి’ పాటను విడుదల చేయనున్నారు.

Game Changer Audio Rights :  ఆడియో రైట్స్‌కు ఎన్ని కోట్లంటే...

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram charan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer). దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్‌ (shankar) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ సంస్థలో నిర్మితమవుతున్న 50వ చిత్రమిది. దిల్‌ రాజు , శిరీష్‌ నిర్మిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం నుంచి 'జరగండి.. జరగండి’ పాటను విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటిదాకా ఒక్క పాట విడుదల కాలేదు. కానీ ఆడియో రైట్స్‌ ద్వారా కోట్లు కొల్లగొడుతుంది. ఈ సినిమా ఆడియో రైట్స్‌ Saregama సొంతం చేసుకుంది. ఆడియో హక్కుల కోసం రూ. 33 కోట్ల రూపాయలు చెల్లించడానికి సదరు ఆడియో సంస్థ అంగీకరించిందని సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రం నుంచి ఒక్క పాట కూడా బయటకు రాలేదు. కానీ ఇంత మొత్తంలో చెల్లించడానికి ఆడియో సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమే! ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా చిత్రాల్లో హయ్యస్ట్‌ అమౌంట్‌ ఈ చిత్రానికే పలికిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. శంకర్‌ సినిమాల్లో పాటలకు ప్రత్యేకత ఉంటుంది.  సౌత్  ఇండియాలో పాటలకు భారీతనం తీసుకొచ్చిందే శంకర్‌ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయనకు తోడు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా ఉండడంతోనే ఆడియో రైట్స్‌ రూ. 33 కోట్లకు డీల్‌ కుదిరిందని సమాచారం. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మాస్‌ ఆడియన్స్ మెచ్చేలా బాణీలు అందిస్తాడు. అది కూడా ఈ చిత్రం ఆడియో రైట్స్‌ ఇంత పలకడానికి  ఓ కారణం అనుకోవచ్చు. (Audio Rights for 33 Crores)

ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. అంజలి మరో కథానాయిక. సముద్రఖని, ఎస్‌.జె సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆ సినిమా రైట్స్‌ సోనీ మ్యూజిక్‌ సొంతం చేసుకుందని తెలిసింది. దానికి కూడా భారీ మొత్తంలో ఆఫర్‌ చేశారని తెలుస్తోంది.

Updated Date - 2023-11-09T16:52:41+05:30 IST