Harish Shankar: రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌‌పై నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన హరీష్

ABN , Publish Date - Jun 19 , 2024 | 05:07 PM

మాములుగా తనపై, తనకు నచ్చిన వారిపై ఎవరైనా కామెంట్స్ చేస్తే.. వెంటనే హరీష్ శంకర్ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవడమే కాదు.. ఆ నెటిజన్లు చేసిన కామెంట్స్‌కు కౌంటర్స్ ఇస్తూ హరీష్ శంకర్ చేసే ట్వీట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి కౌంటరే వేశారు హరీష్ శంకర్. రవితేజ గురించి కామెంట్ చేసిన నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్ శంకర్.

Harish Shankar: రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌‌పై నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన హరీష్
Mr Bachchan Movie Director Harish Shankar

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్ నటిస్తుండగా.. జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన షోరీల్.. మంచి స్పందనను రాబట్టుకుంటోంది. అయితే ఈ సినిమాను ఉద్దేశిస్తూ.. మరీ ముఖ్యంగా రవితేజను టార్గెట్ చేస్తూ తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లయ్‌ వైరల్ అవుతోంది.

మాములుగా తనపై, తనకు నచ్చిన వారిపై ఎవరైనా కామెంట్స్ చేస్తే.. వెంటనే హరీష్ శంకర్ రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవడమే కాదు.. ఆ నెటిజన్లు చేసిన కామెంట్స్‌కు కౌంటర్స్ ఇస్తూ హరీష్ శంకర్ చేసే ట్వీట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి కౌంటరే వేశారు హరీష్ శంకర్. విషయంలోకి వస్తే.. ‘మిస్టర్ బచ్చన్’ సినిమా షోరీల్‌లోని హీరోయిన్ ఇమేజ్‌ని పోస్ట్ చేసిన ఓ నెటిజన్.. ‘‘రవితేజ స్క్రిప్ట్‌ సెలక్షన్‌ కన్నా కూడా హీరోయిన్‌ ఎంపిక చాలా బాగుంటుంది’’ అంటూ వ్యంగ్యంగా ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. నెటిజన్ చేసిన ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. (Harish Shankar Counter)


Ravi-Teja.jpg

‘‘తెలుగు భాషకు మీరు మీ ప్రొఫైల్‌లో చివరి నుంచి రెండో ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి మీరు ఇంకా రిలీజ్ కానీ సినిమా స్క్రిప్ట్‌ గురించి మాట్లాడటం కామెడీగా ఉంది. ముందే తెలిసి ఉంటే మీకు నా సినిమాలో కమెడియన్ ఛాన్స్ ఇచ్చేవాడిని. అయినా పర్వాలేదు.. మీరు మమ్మల్ని బాగానే నవ్విస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి. మీ నుంచి ఇలాంటి కామెడీని ఇంకా ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా..’’ అని హరీష్ శంకర్ కౌంటరిచ్చారు. హరీష్ శంకర్ రిప్లయ్ చూసిన ఫ్యాన్స్.. భలే ఇచ్చిపడేశావ్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan Movie) సినిమా విషయానికి వస్తే.. సాహితీ రాసిన ఓ పాటను కశ్మీర్‌లో చిత్రీకరణ చేయబోతున్నట్లుగా హరీష్ శంకర్ మరో ట్వీట్‌లో తెలియజేశారు.

Read Latest Cinema News

Updated Date - Jun 19 , 2024 | 05:19 PM