Dasari Sahithi: చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అభిమాని
ABN, Publish Date - Apr 24 , 2024 | 09:46 PM
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని దాసరి సాహితి బరిలోకి దిగుతున్నారు. ‘పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాల్లో దాసరి సాహితి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ‘పొలిమేర’ సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితి.. ‘పొలిమేర 2’లో సత్యం రాజేష్ సరసన నటించింది.
రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ (Chevella Parliament) నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని దాసరి సాహితి (Dasari Sahithi) బరిలోకి దిగుతున్నారు. ‘మా ఊరి పొలిమేర’, ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాల్లో దాసరి సాహితి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ‘పొలిమేర’ సినిమాలో గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితి.. ‘పొలిమేర 2’లో సత్యం రాజేష్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు దాసరి సాహితి పొలిటికల్ బాట పట్టారు.
దాసరి సాహితి బుధవారం రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate)గా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు ఆమె నామినేషన్ సమర్పించారు. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉండగా.. ఇప్పుడు దాసరి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. రీసెంట్‌గా ఆమె సోషల్ మీడియా వేదికగా రాజకీయాల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. తను పవన్ కళ్యాణ్‌కు అభిమానినని, తన రీల్స్‌కు రాజకీయాలను ఆపాదించవద్దంటూ కోరారు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకే అడుగు పెడుతున్నారు. చూద్దాం.. ఆమె ప్రభావం ఈ ఎన్నికలలో ఎలా ఉండబోతుందో..
Read Latest Cinema News