Ram Pothineni: ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్కే వేరు..
ABN, Publish Date - Aug 04 , 2024 | 10:58 PM
ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌తో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. ఆదివారం వైజాగ్‌లో జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు మాంచి కిక్ ఇవ్వబోతుందని రామ్ అన్నారు.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), డైనమిక్ పూరి జగన్నాధ్ (Puri Jagannadh) డెడ్లీ కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double ismart). తాజాగా విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌తో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్ థ్రిల్లింగ్ డోస్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. ఆదివారం వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగిన వేడుకలో మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read- Double ismart Trailer: ఇప్పుడు పడింది అసలైన బొమ్మ.. దిమాక్ ఖరాబ్!
ఈ కార్యక్రమంలో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ (Ram Pothineni Speech).. ‘‘2018లో పూరిగారిని గోవాలో కలిశాను. ఎలాంటి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు పదేళ్ళ తర్వాత గుర్తుండిపోయే క్యారెక్టర్ చేద్దామని అన్నాను. అప్పుడు ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’ రాశారు. ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ వాడు. యాక్ట్ చేస్తున్నపుడు నాకు వచ్చిన కిక్ వేరు. అలాంటి మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్‌తో ఒక కిక్-యాస్ స్క్రిప్ట్ వుంటే ఎలా ఉంటుందని అనుకున్నాం. అప్పుడు ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ స్క్రిప్ట్ రాశారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ టైం తీసుకొని చేశారు. చాలా కష్టపడ్డారు. ఆయనతో పని చేసినప్పుడు ఎంత కిక్ వుంటుందో స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అంతే కిక్ వుంటుంది. (Double ismart Trailer Launch Event)
కమర్షియల్ సినిమా అంటే గుర్తుకువచ్చేది పూరి గారే. కమర్షియల్ సినిమా అంటే అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి కమర్షియల్ సినిమా హిట్ అయితే దాంట్లో వచ్చే కిక్ ఇంక దేంట్లో రాదు. కమర్షియల్ సినిమాతో థియేటర్స్‌లో చేసుకునేది ఒక సెలబ్రేషన్. అది ‘ఇస్మార్ట్ శంకర్’ అప్పుడు చూశాను. మళ్ళీ ‘డబుల్ ఇస్మార్ట్’కి ఆ కిక్ వుంటుందని ఆశిస్తున్నాను. అందరం చాలా ఇష్టపడి చేశాం. అలీ గారి ట్రాక్‌తో చాలా ఎంజాయ్ చేస్తారు. కావ్య స్వీట్ హార్ట్. చాలా మంచి అమ్మాయి. ‘టెంపర్’ వంశీ క్యారెక్టర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. విష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తను ఛార్మిగారికి రైట్ హ్యాండ్ లాంటి వాడు. చాలా కష్టపడ్డారు. ఛార్మి గారికి థాంక్ యూ. ఫ్యాన్స్ నుంచే ఎనర్జీ వస్తుంది. వైజాగ్ వచ్చిన ప్రతిసారి ఆ ఎనర్జీ తీసుకెళ్లా. ఆగస్ట్ 15న కలుద్దాం. మార్ ముంతా చోడ్ చింతా. థాంక్ యూ అల్’’ అని అన్నారు.
పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
Read Latest Cinema News