Naveen Yerneni: కిడ్నాప్‌తోపాటు మరో కేసులో నిర్మాత నవీన యెర్నేని
ABN, Publish Date - Apr 15 , 2024 | 06:01 PM
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ నిర్మాత పేరు బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో బాధితుల ఫిర్యాదు మేరకు మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకనైన నవీన్ యెర్నేని (Naveen Yerneni) పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు.

ఈ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త, ఎన్‌ఆర్‌ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Allu Arjun: 'పుష్పరాజ్'కు బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు!
గతంలో తాను నెలకొల్పిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. 2018 కిడ్నాప్ కేసులో పుష్ప 2 నిర్మాత నవీన్ యెర్నేనితోపాటు పలువురు ఎన్ఆర్‌ఐల మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది.
మాజీ టాస్క్ ఫోర్స్ డీ సీ పీ రాధాకిషన్ రావు సాయంతో క్రియా హెల్త్ కేర్ అనే సంస్థని లాక్కున్నటు చెన్నుపాటి వేణు మాధవ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నవీన్ పాత్రపై నలు ఆధారాలు లభ్యం కావడంతో నిర్మాతను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పుష్ఫ-2 (pushpa 2)నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఆగస్ట్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.