Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు విడుదల అప్పుడే, ఎందుకంటే...

ABN , Publish Date - Apr 15 , 2024 | 05:39 PM

అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా కొత్త విడుదల తేదీని ఒక వావిధ్యమైన వీడియో చేసి అల్లరి నరేష్ ప్రకటించారు. అంకం మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది అంటే...

Allari Naresh: ఆ ఒక్కటీ అడక్కు విడుదల అప్పుడే, ఎందుకంటే...
A still from Aa Okkati Adakku

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి వుంది, కానీ విడుదల వాయిదా వేశారు. కొత్త తేదీని తరువాత ప్రకటిస్తాం అని చిత్ర నిర్వాహకులు చెప్పారు. అయితే ఈరోజు ఒక వైవిధ్యమైన పద్దతిలో ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతున్నది ఈ సినిమాలో కథానాయకుడైన అల్లరి నరేష్ తో చిత్ర నిర్వాహకులు చెప్పించారు.

Allarinaresh.jpg

ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతోందో తెలుసా, మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది అని చెప్పారు. ఈ సినిమా నేపధ్యం కూడా కథానాయకుడైన నరేష్ పాత్ర పేరు గణ, అతను 25 రోజుల్లో పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడని ఒక పూజారి ద్వారా తెలుసుకుంటాడు. అందుకోసమని అతని కుటుంబం ఒక అమ్మాయి కోసం వేట మొదలుపెడతారు, కానీ గణ ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు, ఆమె కూడా గణ అంటే ఇష్టం అంటుంది, ఇంకేముంది గణ పెళ్ళైపోతుంది అని అందరూ అనుకుంటారు, కానీ పెళ్లి విషయం తెచ్చేసరికి ఫరియా 'ఆ ఒక్కటీ అడక్కు' అని సున్నితంగా తిరస్కరిస్తుంది.

allarinareshfaria.jpg

ఇంకేముంది దానితో గణ కథ మళ్ళీ మొదటికి వస్తుంది, అమ్మాయి కోసం వేట మొదలవుతుంది. ఇంతకీ గణ కథ ఏమైంది, ఎటు తిరిగింది అనే విషయాలన్నీ వినోదభరితంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఒక చిన్న రొమాన్స్‌తో కూడిన వినోదాత్మక ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. దీనికి రాజీవ్ చిలక నిర్మాత. ఈ చిత్రంలో ఇంకా వెన్నెల కిషోర్, జామీ లీవర్, హర్ష చెముడు, అరియానా గ్లోరీ, హరితేజ కూడా వున్నారు. ఇంతకీ నరేష్ కి ఈ సినిమా లో ఫారియాతో పెళ్లయిందా లేదా వేరే అమ్మాయి దొరికిందా అనే విషయం మే 3వ తేదీన థియేటర్స్ లో విడుదలైనప్పుడు తెలిసిపోతుంది.

Updated Date - Apr 15 , 2024 | 05:39 PM