Devara: ‘దేవర’ ముంచుతాడా.. మురిపిస్తాడా.. ఈ లెక్కలేంటి
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:56 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఇమేజ్‌పై ఒకటే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ నుంచి సోలోగా సుమారు 6 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తోంది. (Devara Business)
Also Read- Devara: డబ్బులిచ్చి ‘జై’ కొట్టించుకున్నారా..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ఎంత అనేది క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. ఎన్టీఆర్ చివరగా సోలో హీరోగా నటించిన ‘అరవింద సమేత’ బిజినెస్‌కు తగ్గ షేర్‌ను కూడా రాబట్టలేకపోయిందనే ప్రచారం ఉంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’తో పాన్ ఇండియా హీరోగా ఎన్టీఆర్‌కు ఇమేజ్ వచ్చినా.. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ మాత్రం ఎక్కువగా రాజమౌళి ఖాతాలోకే పోయింది. ఈ క్రమంలో ‘దేవర’తో సోలో హీరోగా ఎన్టీఆర్ మార్కెట్ ఎంత అనేది తేలాల్సి ఉంది. అయితే ‘దేవర’ విషయంలో మాత్రం ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్‌ను చూపించి సినిమా విడుదలకు ముందు హైప్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా టాక్ వినబడుతుండటం విశేషం.
మొదటి నుంచి ‘దేవర పార్ట్ వన్’కు హైప్ క్రియేట్ అయితే బిజినెస్ భారీగా అయిపోతుందని మేకర్స్ భావించారు. కానీ సినిమా హక్కులను కొనేందుకు పెద్దగా ఎవరు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. చివరికి నిర్మాత నాగవంశీ దేవర హక్కులు పోటీపడి తీసుకున్నాడంటూ.. అది కూడా కనీవినీ ఎరుగని రేట్‌కు అంటూ ప్రచారాలు జరిగాయి. వాస్తవానికి ‘దేవర’ మేకర్స్ భారీ రేట్లు చెప్పగా.. కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రాకపోవటంతోనే.. నిర్మాత నాగవంశీ చేత ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయించినట్లుగా ఇండస్ట్రీ టాక్. తెలుగు రాష్ట్రాల హక్కులను నాగవంశీ రూ. 175 కోట్లతో కొన్నాడని ‘దేవర’ టీమ్ ఓ వైపు ప్రచారం చేయించుకుంటూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే.. దేవర రూ. 350 కోట్ల గ్రాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోవాల్సి ఉంటుంది. ఎంతో హైప్, క్రేజ్ ఉన్న సినిమాలకే ఇది సాధ్యం కాని పరిస్థితి.
Also Read- Vijayawada Floods: బాలయ్యతో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్కులిచ్చేందుకు వచ్చిన యంగ్ హీరోలు
పైగా ఎన్టీఆర్ సినిమాను ఎగబడి చూసేంత ఆసక్తి ఏపీలో అయితే కనిపించటం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తన స్నేహితుల కోసం కుటుంబాన్ని, సొంత పార్టీని దూరంగా పెడుతూ వస్తున్నాడనే వార్తలు గత సంవత్సర కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అది ‘దేవర’ ఓపెనింగ్స్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ సినిమా హిట్ అయితే.. ఎవరు ఆపలేరనుకోవడానికి.. సినిమా ట్రైలర్ వచ్చాక ‘దేవర’పై అభిమానులకు ఉన్న కొద్దిపాటి హోప్స్ కూడా పోయాయి. మరి నిర్మాత నాగవంశీ పరిస్థితి ఏంటో అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే బాలీవుడ్‌లో ‘దేవర’ డిస్ట్రిబ్యూషన్‌ను తీసుకోవటానికి ఆసక్తి చూపని క్రమంలో కరణ్ జోహార్ చేతిలో పెట్టేశారనేలా టాక్ నడుస్తుంది. అలాగే శాటిలైట్ హక్కుల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇలా విడుదలకు ముందే బిజినెస్ పరంగా ‘దేవర’పై ఎక్కడాలేని నెగిటివిటీ నడుస్తోంది. మరి ఈ నెగిటివిటీకి ఆ ‘దేవర’ ఎలా సమాధానమిస్తాడో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read- Bangalore Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీ కేస్‌లో కీలక పరిణామం.. హేమకు షాక్
Read Latest Cinema News