Kandula Durgesh: నిర్మాతలకు ఏపీ నూతన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆహ్వానం!

ABN, Publish Date - Jun 20 , 2024 | 09:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ గురువారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో స్టూడియోలను నిర్మించేందుకు నిర్మాతలకు ఆహ్వానం పలికారు.

AP Tourism Culture And Cinematography Minister Kandula Durgesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా కందుల దుర్గేష్ గురువారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు హాజరై మంత్రికి అభినందలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాతలకు మినిస్టర్ కందుల దుర్గేష్ (Kandula Durgesh) ఏపీ‌లో స్టూడియోలు నిర్మాణం కొరకు ఆహ్వానం పలికారు.

పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్..

‘‘మంచి వనరులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాను. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తాం. పర్యాటక ప్రాంతాలుగా విరజిల్లాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించింది. అదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజానీకం వైసీపీ‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. ఇకపై పర్యాటక సాంస్కృతిక విధానాల్లో సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్లి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు ఉంటాయి. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. (AP Cinematography Minister)

Also Read-Chiranjeevi: ఆ వెబ్ సిరీస్ చూసిన చిరు.. రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్!


మన రాష్ట్రం సినిమాటోగ్రఫీకి అనేక విధాలుగా తోడ్పడింది. కోనసీమ, కృష్ణ పర్యాటక ప్రాంతాల్లో అనేక షూటింగులు జరిగాయి. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే కేరళ నుంచి కోనసీమను అభివృద్ధి చేసేవాళ్లు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం.. సినిమా షూటింగ్‌లకు ఉపయోగించుకుంటాం. ఏపీ‌లో స్టూడియోలు నిర్మాణం చేయటానికి ముందుకు రావాలని నిర్మాతలకు (Producers) ఆహ్వానం పలుకుతున్నాం. రెండు కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మొదటి సంతకం పెట్టా. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’’ అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పుకొచ్చారు. (AP Tourism Minister)

Read Latest Cinema News

Updated Date - Jun 20 , 2024 | 10:16 PM