Kutami: మోడీ, చంద్రబాబు, పవన్‌లకు శుభాకాంక్షల వెల్లువ

ABN , Publish Date - Jun 05 , 2024 | 09:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం, మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన కలిపి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 175 స్థానాలున్న అసెంబ్లీలో మిత్ర పక్షాల కూటమి 164 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఈ ఎన్నికలలో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నరేంద్ర మోడీకి సెలబ్రిటీలు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Kutami: మోడీ, చంద్రబాబు, పవన్‌లకు శుభాకాంక్షల వెల్లువ
Chandrababu, Modi and Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం, మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన కలిపి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 175 స్థానాలున్న అసెంబ్లీలో మిత్ర పక్షాల కూటమి 164 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఇది నిజంగా ఒక రికార్డు అని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంటు స్థానాల్లో గెలిచి నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న పార్టీగా సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఇక ఈ విజయం తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుపై, అలాగే ఈ విజయానికి కారణమైన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్‌పై సినీ, రాజకీయ వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ పొలిటికల్ వ్యవహారాలలో కామ్‌గా ఉండే సినీ పరిశ్రమ నుంచి ఈసారి విజేతలకు అభినందనలు వెల్లువెత్తుతుండటం విశేషం. ఎలక్షన్ కౌంటింగ్ రోజు సినీ ఇండస్ట్రీ నుంచి ఎందరో ఎక్స్ వేదికగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), మంచు మనోజ్ (Manchu Manoj), హీరో రామ్ (Ram), సముద్రఖని (Samuthirakani) వంటి వారంతా శుభాకాంక్షలు తెలిపారు.


Mahesh-Babu.jpg

కూటమి విన్నర్స్ అయిన నరేంద్ర మోడీ (Narendra Modi), నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)లకు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రజినీకాంత్.. మోడీ, చంద్రబాబు, స్టాలిన్‌లకు శుభాకాంక్షలు తెలపగా.. మహేష్ బాబు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీలకు విడివిడిగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మంచు మనోజ్ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు తనదైన తరహాలో శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం వీరి ఎక్స్ పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి.

Updated Date - Jun 05 , 2024 | 09:01 PM